వేదాలెన్ని అవేమిటి

Bhagavat Geeta Photo by Ranjit Pradhan from Pexels: https://www.pexels.com/photo/a-chariot-figurine-12520328/
Reading Time: < 1 minute

వేదాలెన్ని అవేమిటి

వేదాలు నాలుగు ఋగ్  వేదం యజుర్ వేదం సామ వేదం అథర్వణ వేదం.

ఇవి చాలా ప్రాచీన గ్రంధాలు. ఇవి  మహర్షుల ధ్యానంలో వెలువడ్డాయని తెలియబడుచున్నది. కాబట్టి ఇవి చాలా పవిత్రమైన జ్ఞానముగా అధ్యయనము  మరియు ఇవి బోధించిన విధంగా ఆచరణాలలో అనుకరించిన మానవుడు కైవల్యం పొందగలదని చెప్పియున్నది. ఇవి ధ్యానంలో  వెలువడ్డాయి కావున ఇవి శృతులని కూడా పిలబడుతున్నాయి. ఇవి అతి ప్రాచీనమైన ముఖ్యమైన   మానవోద్ధరణకు సంబంధించిన గ్రంధాలు.

వేదాలకు అనేక ఉప గ్రంధాలున్నాయి. వీటిని వేదాంగాలు అని కూడా అంటారు. వాటిల్లో ప్రముఖమైనవి ఉపనిషత్తులు, ఉపవేదాలు, అరణ్యకములు, వేద సంహితలు, దర్శనాలు మరియు మీమాంసలు మొదలైనవి. అవి అన్నియు ప్రాకృత భాష ఐన సంస్కృతం నందు వ్రాయబడ్డాయి. మహర్షులు తమకు ధ్యానములో కలిగిన జ్ఞాన సంపదను వచించగా శిష్యులు వీటిని తాళ పాత్రములలో వ్రాసితిరని చరిత్ర వలన తెలియుచున్నది. ఆధునిక యుగములో ఇవి చాలా భాషలలోకి అనువదింపబడ్డాయి. మొదటగా వ్రాసిన భాష ప్రాకృతమైన సంస్కృతం.

ఈ భాషను అర్థము చేసికొనుట మిక్కిలి కష్టము. ఎందువలన అనగా ప్రాచీన సంస్కృతభాష లోని ప్రతి పదమునకు అనేక పర్యాయ పదములుండుటయే దీనికి కారణము. కావున ప్రతి మాట యొక్క అర్థమును సందర్భోచితముగా గ్రహించుట అత్యంత ఆవశ్యకము.  ఈనాడు చాలా వరకు వేదాలకు ఆగ్లానువాదం లభించగలదు. నేడు ఆధునిక యుగంలో చాలా పరిశోధనలు జరిపినందున ఈ వేద జ్ఞానము కంప్యూటర్ లో అందరికీ లభ్యంలో కి వచ్చింది. వేదాలు మానవునికి ఆదర్శాలు మరియు ఇవియే అనుసరించదగ్గవి.

ఇవియే మానవ జీవితాన్ని సార్ధక పరచునేందుకు ప్రమాణాలు. ఇవియే భగవత్ గ్రహీతమైన ఉద్గ్రంధాలు. వీటిలో మానవుని కల్పనకు తావు లేదు. వీటిని ఉఛ్చరించుటకుగాను మరియు మననము చేయడానికి గాను నిర్దిష్టమైన స్వరం మరియు వేగం నిర్దేశింపబడినవి. ఆ విధంగా మననం చేసిన యెడల విన సొంపుగాను మరియు మనపై గొప్ప ప్రభావమును జూపును. మననం త్రాయతే ఇతి మంత్రః అని చెప్పియున్నారు. అనగా ఏవైతే పలు మార్లు జపించిన లేదా ఉఛ్చరించిన మనలోని అరిషడ్వార్గాలను నశింపజేసి  మనలను జనన మరణ విముక్తుల్ని కావిస్తాయో వాటిని  మంత్రాలు అని తెలియజేయడమైనది. మంత్రాలు భగవత్  దత్తమైనవి.   

సంక్షిప్తంగా చెప్పాలంటే ఋగ్వేదం లో మానవుడు దైనందిన జీవితములో అనుసరించవలసిన ఆచరణలు, భగవంతుని గురించి తెలుపబడియున్నది. యజుర్వేదం లో భగవంతుని సృష్టిని గూర్చి తెలియజేయడమైనది. సామవేదములో సంగీతము మరియు వైద్యము మొదలైన మానవోద్ధరణకు ఉపయోగపడే శాస్త్రాల గూర్చి తెలియజెప్పారు. అథర్వణ వేదములో భగవంతుని చేరుకొనే మార్గాల గురించి మరియు ప్రత్యేకముగా మానవుడు కావించవలసిన నిత్య కృత్యాల గూర్చి తెలుపబడియున్నది. కావున మానవులు వేదాధ్యయనము కావించి   జన్మ సాఫల్యము  మరియు సార్థకము చేసికొందురని ఆశిద్దాం.

Leave a Reply