తంబుర వాయిద్యం

Tanpura @wikipedia
Reading Time: 2 minutes

తంబుర వాయిద్యం

తంబుర వాయిద్యం కర్ణాటక మరియు హిందూస్థానీ సంగీతం రెండిటియందును ఉపయోగిస్తారు. శృతి వాయిద్యాలతో తంబుర అతి ప్రధానమైనది. ఇది తంత్రీ వాయిద్యమునకు చెందినది. దీని శృతి జీవం కలదిగా ఉందనడం వలన దీనిని ప్రతి సంగీత ప్రదర్శనల యందు ఉపయోగిస్తారు. దీనిని శృతి చేయడానికి తగిని అనుభవం అవసరం. ఇది రెండు రకాలు ఒకటి దక్షిణదేశపు సంగీతం మరియు ఉత్తర దేశపు సంగీతం.

దక్షిణ దేశపు తంబూరను పనస కర్రతో తయారు చేయుదురు. ఇందుకు కారణం పనస కర్ర సమ శీతోష్ణముగా ఉండడం వలన దీని ధ్వని ఎల్లప్పుడూ ఒకే విధంగానూ గంభీరంగా ఉండును. దీని పీటకును బిడాలకును చందనపు కర్రను గాని నలుపైనా కర్రను గాని ఉపయోగిస్తారు. ఉత్తరదేశపు తంబూరను సొరకాయ బ్దుర్రతో తయారు చేస్తారు. కాబట్టి దీని ధ్వని గంభీరంగా ఉంటుంది. తంబురాలో ఉన్న నాలుగు తంత్రుల కొనలను పీట వెనుక భాగమున ముడి వేసి రెండవ కొనను పీత మీదుగా పైనుండి బిడాలకు చుడతారు.

Photo by Sohani Kamat from Pexels: https://www.pexels.com/photo/cute-girl-playing-tanpura-instrument-10491565/

తంబూరను ముఖ్యముగా రెండు విధాలుగా శృతి చేస్తారు. ఒకటి పంచమ  శృతి రెండవది మధ్యమ శృతి లో శృతి చేస్తారు. పంచమ శృతిలో రెండవ మూడవ తంత్రులను మధ్య షడ్జ్య్ మము గానూ ఒకటవ తంత్రిని మంద్ర పంచమము గానూ నాల్గవ తంత్రిని షడ్జ్య్ మముగా పంచమ శృతిలో చేస్తారు. మధ్యమ శృతిలో పైన తెలిపిన పంచమ శృతి లో ఒకటవ తంత్రిని మంద్ర పంచమము గా మంద్ర మధ్యమముగా శృతి చేస్తారు. నాలుగు తంత్రులను మీటేటప్పుడు కుడి చేతి మణికట్టుకు కుండపై ఆనించి మధ్యమ వేలితో మిగిలిన తంత్రులను మీటుతారు.  

తంబుర వీణలాగే క్రింది భాగమున కుండవలె, పై భాగమున సన్నని కర్ర ఆకృతి వలె ఉంటుంది. దీనిని సుందరంగా తీర్చడానికి చిన్న డిజైనులు  కుండపై  అలంకరిస్తారు. దీనిని శృతి ఆధారానికి మరియు గంభీరమైన స్వరానికి ఉపయోగిస్తారు. దీనిని సంగీత ప్రదర్శనలలో వాయించుట వలన చక్కని స్వరముతో వీనుల విందుగా నుండును. సంగీత కచేరీలలో వేరే శృతి వాయిద్యములను కూడా ఉపయోగిస్తారు. ఉదాహరణకు హార్మోనియం మరియు పిచ్ పైపు మొదలైనవి.

కానీ తంబూరను సర్వ సాధారణముగా సంగీత ప్రదర్శనలలో ఉపయోగిస్తారు. కొన్ని సంగీత మరియు వాద్య ప్రదర్శనలలో రెండు తంబూరాలు కూడా ఉంటాయి. అందుకు కారణం ధ్వని ప్రదీప్తమవ్వడానికి. తంబుర ధ్వని  మనసుకు హాయి గొల్పుతుంది. ఈనాడు ఈ తంబూరాలు ఎలక్ట్రానిక్ పరికరంలో నూ లభ్యమౌతున్నాయి. ఈ ఎలక్ట్రానిక్ తంబూరాలలో కూడా అనేకమైన రకములైన శృతులను ఎంపిక చేసికొనవచ్ఛును.  

Leave a Reply