మరిడయ్య మోసం

Cheating Photo by Gustavo Fring from Pexels: https://www.pexels.com/photo/flirty-young-lady-asking-to-keep-secret-sitting-in-office-4149070/
Reading Time: < 1 minute

మరిడయ్య మోసం

ఒక ఊళ్ళో మరిడయ్య అనే వ్యక్తి ఉండేవాడు. ఆతను ప్రతీ విషయం  అస్తమానం అతిగా ఆలోచిస్తూ ప్రతీ విషయాన్ని మర్చిపోయేవాడు. దీనిని సాకుగా చేసుకొని ఆతను ఏ పని  సరిగ్గా చేసేవాడు కాదు. ఆతను ఒక సామానులు దుకాణంలో ఒక యజమాని వద్ద పని చేసేవాడు.

ఎవరైనా ఎవరికైనా ఏదైనా లోపం ఉంటే దానిని అధిగమించడానికి ప్రయత్నిస్తారు. ఎలాగైతే కళ్ళు సరిగ్గా కనబడకపోతే కళ్లద్దాలు పెట్టుకోవడం, బాధితులు వారికి సరిగ్గా వినిపించే విధంగా చెవిలో మిషిన్లు లాంటివి పెట్టుకుంటారు. మరిడయ్య తనకు మర్చిపోయే అలవాటు ఉంటే దానికి తగిన విధంగా ఏదైనా విషయాన్ని ఎక్కడైనా వ్రాసుకోవడమో లేదా అలారమ్ లాంటివి పెట్టుకోవడమే చెయ్యాలి. అవేమి చేయకుండా “నాకు మతిమరుపు .. నేను ,మర్చిపోయాను”  అంటూ సాకులు చెబుతూ పని ఎగ్గెట్టే వాడు. ఇతరులను మోసగించేవాడు.

యజమాని చాలా సార్లు ఊరుకున్నాడు. కానీ ఎన్నోసార్లు “నీ మతిమరుపును ఏదైనా ఒక మార్గం చూసుకో. లేకపొతే అది చాలా పెద్ద ప్రమాదం కావొచ్చు” అని చెప్పాడు. మరిడయ్య దానిని విని మిన్నకున్నాడు. ఇలాగే అలవాటై ఇంట్లో కూడా ప్రతీదానికి “నేను మర్చిపోయాను” అని పనులుకు ఎగనామం పెట్టేవాడు. ఇంట్లో వాళ్లు కూడా ఇతని ఈ కుంటి సాకులకు ఏదైనా చెయ్యాలి అనుకునేవారు.

ఒకనాడు మరిడయ్య కు చాలా జబ్బు చేసింది. ఆతను తన పట్నంలో చదివే కొడుకుకు మందులు తెమ్మని చెప్పాడు. కొడుకు మందులు తెచ్చాడు కానీ అతనికి వెంటనే ఇవ్వకుండా ఒకరోజు తరువాత ఇచ్చి తాను ” ఇవ్వడం మరిచిపోయానని” చెప్పాడు. మరిడయ్యకు బాధ కలిగింది. ఒకరోజు మరిడయ్య కు తాను ఇంటికి త్వరగా వస్తానని మంచి భోజనం వండమని భార్యకు చెప్పి వెళ్ళాడు. భార్య కూడా మరిడయ్య బుద్ధి చెప్పాలని మరిడయ్య ఇంటికి వచ్చే సరికి ఏమి వండకుండా..” అయ్యో మీరు త్వరగా వస్తానని చెప్పారా.. నేను మరిచిపోయానండి.. ఇదిగో ఇప్పుడే క్షణాల్లో వంట చేస్తానని” అందంతో మరిడయ్య కు తాను ఇతరులకు చేసే సాకులు గుర్తుకు వచ్చాయి.

మరిడయ్య ఆ రోజు తన యజమానికి తనకు డబ్బు అవసరం ఉందని తనకు డబ్బులు రేపటికల్లా కావాలని చెప్పాడు. యజమాని కూడా మరిడయ్యకు ఆతను చేసిన వ్యవహారానికి తగిన ప్రతీకారం చెయ్యాలని మరునాడు మరిడయ్య డబ్బుల గురించి వస్తే “అయ్యో మరిడయ్య నా వద్ద ఇప్పుడు డబ్బు లేదు. నేను పక్కింటి మాధవయ్య అడిగితే నిన్ననే ఇచ్చేసాను. నీకు డబ్బు అవసరం ఉందనీ ఈ రోజు నీకు కావాలని చెప్పావు. కానీ నేను ఈ విషయమే మర్చిపోయాను..నీకె నేను ఇంకో రెండు రోజులలో డబ్బు ఇవ్వగలనని” చెప్పడం తో మరిడయ్య తాను ఇంతకూ ముందు చేసిన నిర్వాకం తెలిసి కనువిప్పు కలిగి ఇక ముందు ఇంకెవ్వరికి తాను మర్చిపోయాననే సాకులతో మోసగించ కూడదని బుద్ధి తెచ్చుకున్నాడు.

.

Leave a Reply