పటాకులు కాలుస్తా

Fire Cracker Photo by Juan Cruz Palacio Mir from Pexels
Reading Time: < 1 minute

పటాకులు కాలుస్తా

పగలు రాత్రి తేడా లేకుండా పటాకులు కాలుస్తా..
ఏ సంఘ సంస్కర్త ఉచిత సలహాలు మాకు అవసరం లేదు.


మతాలకు అతీతంగా 5 కోట్ల కుటుంబాలకు ఉపాధి కల్పిస్తున్న ఈ దీపావళి పటాకులు అంటే నాకూ చాలా ఇష్టం.

పొల్యూషన్ ఆపాలంటే నీ కార్ అమ్మేసి సైకిల్ కొనుక్కో
నీ బైక్ అమ్మేసి నడుచుకుంటూ పో

ఫ్యాక్టరీలు తీసేసి కార్మికులకి ఉపాధినివ్వు

షాపింగ్ కి వెళ్ళి బట్టలు చేతిలో పట్టుకొని ఇంటికి రా

కూరగాయలు
మీ ఇంట్లో ఒక్కొక్కరు ఒక్కోటి
సొరకాయ ఒకడు
పొట్లకాయ ఒకడు
వంకాయలు ఒకరు
మిరపకాయలు కొందరు
మోసుకు రండి.
క్యారీబ్యాగ్ వద్దు.

సెల్ ఫోన్ వాడకండి
పిట్టలు చచ్చిపోతున్నాయ్

కరెంట్ బహిష్కరించండి
మొన్న గబ్బిలం వేలాడింది శవమై

బల్బు వాడకండి
పురుగులు చచ్చిపోతాయ్

చనిపోయినప్పుడు శవం ముందు,
పెళ్ళైనప్పుడు జంట ముందు పేల్చకండి,
అవే డబ్బులతో పేదవారికి
సహాయం చేయమంటావా!
అయితే నీ పుట్టిన రోజుకి పార్టీకి అయే డబ్బులు ఇచ్చెయ్,

పిజ్జా ఎందుకు అన్నం తింటావ్ గా
ఆ డబ్బులిచ్చేయ్,

ఫ్యాన్ ఉందిగా
AC ఎందుకు
ఆ డబ్బులిచ్చేయ్

కుండ ఉందిగా,
ఫ్రిజ్ ఎందుకు
అది అమ్మి ఇచ్చేయ్.

అప్పుడు నేను మానేస్తా!
అప్పటి దాకా బరాబర్ టపాకాయలు
కాలుస్తా.

ఇది ఒక్కే రోజు కాలుష్యం

మనిషి అవసరాలు నిత్య కాలుష్యం.

“విజ్ఞాన ప్రదర్శనలొద్దు.”

“హిందూ పండగలు రాగానే లాజిక్కులు చెప్పకండి”

కుహనా మేధావులు ఎక్కువ అయ్యారు.

Leave a Reply