
వంకాయ
వంకాయ గుడ్డు ఆకృతిలో ఉండి,ఒక మెరిసే చర్మం కలిగి,ముదురు ఊదా,తెలుపు లేదా పసుపు రంగులలో ఉంటుంది. వంకాయలో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇది ఆహార ప్రేమికులకు ఇష్టమైన కూరగాయలలో ఒకటి.
వంకాయ కూర తింటే
‘ఆహా! ఏమి రుచి’ అనాల్సిందే. కాయగూరల్లో వంకాయ రాజు. వంకాయ రుచితో పాటు ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. వంకాయ తొక్కలో ఉండే యాంథోసియానిన్స్, యాంటీ ఆక్సిడెంట్లు కేన్సర్ కణాలకు వ్యతిరేకంగా పోరాడతాయి. వయస్సు ఛాయలు కనిపించనీయవు. శరీరంలో వాపు, నరాల బలహీనత తగ్గించే శక్తి వంకాయలకు ఉందని డైటీషియన్లు చెబుతున్నారు.
ముఖ్యంగా షుగర్ వ్యాధితో బాధపడేవారు దీన్ని ఎంత ఎక్కువ తీసుకుంటే అంతమంచిదట. దీనిలో తక్కువ మోతాదులో గ్లిజమిక్ ఇండెక్స్ ఉంటుంది. దీని కారణంగా దీన్ని ఎంత ఎక్కువ తీసుకున్నా ఆరోగ్యానికి హాని చేయదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఇది ఎంతో ప్రతిభావంతమైన యాంటీ వైరల్, యాంటీ బాక్టీరియా లక్షణాలను కలిగి వుంటుంది. శరీరంలో హాని కలిగించే బాక్టీరియాలను అంతం చేయడంలో వంకాయ ఎంతోగానో ఉపయోగపడుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
కొన్ని అధ్యయనాల ప్రకారం వంకాయ మొక్కలో ఇతర మొక్కల కంటే ఎక్కువ నికోటిన్ ఉంటుందని నిరూపణ జరిగింది. ఆరోగ్యానికి వంకాయ మంచి చేస్తుందా అని ఒక సాధారణ ప్రశ్న కలుగుతుంది. కానీ,మీ శరీరంనకు హాని చాలా తక్కువగా ఉంటుంది. మీరు వంకాయ యొక్క ప్రయోజనాలను ఒకసారి తెలుసుకొంటే,ఆరోగ్యం కోసం వంకాయ మంచిదని తెలుస్తుంది.
వంకాయ ప్రయోజనాలు
వంకాయలో విటమిన్లు, ఖనిజాలు కీలకమైన ఫైటో పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. వంకాయ పొట్టులో ఉండే ఆంథోసియానిన్ ఫైటో న్యూట్రియెంట్‌ను న్యాసునిన్ అంటారు. ఇది యాంటీఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది. శరీరంలో ఎక్కువైన ఇనుమును తొలగిస్తుంది. ఫ్రీరాడికల్స్‌ను నిరోధిస్తుంది. రక్తంలో కొలెస్ట్రాల్ కణాఉల దెబ్బతినటాన్ని నరిఓధించడం ద్వారా క్యాన్సర్‌ను నివారిస్తుంది. కీళ్లు దెబ్బతినటాన్ని తగ్గిస్తుంది. కొలెస్ట్రాల్ నిల్వల్ని తగ్గిస్తుందివంకా.
స్ప్లిన్ వాపు (spleenomegaly) లో వంకాయ అమోఘముగా పనిచేస్తుంది . పచ్చి వంకాయ పేస్టుకి పంచదార కలిపి పరగడుపున తినాలి .
వంకాయ కొలెస్టిరాల్ తగ్గించేందుకు సహకరిస్తుంది,
వంకాయ, టమటోలు కలిపి వండుకొని కూర గాతింటే అజీర్ణము తగ్గి ఆకలి బాగా పుట్టించును.
వంకాయను రోస్టు చేసి తొక్కను తీసేసి కొద్దిగ ఉప్పుతో తింటే ” గాస్ ట్రబుల్, ఎసిడిటీ, కఫము తగ్గుతాయి.
వంకాయ ఉడకబెట్టి … తేనెతో కలిపి సాయంతము తింటే మంచి నిద్ర వస్తుంది . నిద్రలేమితో బాధపడేవారికి ఇది మంచి ఆహారవైద్యము .
వంకాయ సూప్, ఇంగువ, వెళ్ళుల్లితో తయారుచేసి క్రమము తప్పకుండా తీసుకుంటే కడుపుబ్బరము (flatulence) జబ్బు నయమగును .
మధుమేహం ఉన్నవారు వంకాయ వలన అన్నము కొద్దిక తినడము వలం, దీనిలోని పీచుపదార్దము మూలాన చెక్కెర స్థాయిలు అదుపులో ఉండును .
కొన్ని ఆఫ్రికా దేశాలలో ఫిట్స్ వ్యాధి తగ్గడానికి వాడుతున్నారు .
వంకాయ రసము నుండి తయారుచేసిన ఆయింట్ మెంట్లు, టించర్లు, మూలవ్యాధి (Haemorrhoids) నివారణలో వాడుతారు .
దీన్ని పేదవారి పోటీన్ (మాంసము ) గా నూట్రిషనిస్టులు భావిస్తారు .
ఇక్కడ వంకాయ యొక్క ఆరోగ్య ప్రయోజనాలు మరియు మీ ఆహారంలో వంకాయను చేర్చడానికి మరిన్ని కారణాలను తెలియచేస్తుంది.
ఫ్రీ రాడికల్స్ మీద పోరాటం
ఫ్రీ రాడికల్స్ వలన జరిగే సెల్ నష్టాల అన్ని రకాల బాధ్యతను తీసుకుంటుంది. వంకాయలో యాంటీఆక్సిడెంట్లు అధిక కంటెంట్ ఉండుట వలన ఫ్రీ రాడికల్స్ మీద పోరాడటానికి సహాయపడుతుంది. చ్లోరోగేనిక్ యాసిడ్ వంకాయలో ప్రధాన యాంటి ఆక్సిడెంటుగా పరిగణిస్తారు. ఇది ఫ్రీ రాడికల్స్ చర్య వలన వచ్చే వ్యాధులను నిరోధించడానికి సహాయపడుతుంది.
ఆరోగ్యకరమైన గుండె
వంకాయను క్రమం తప్పకుండా తీసుకొంటే కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి. అంతేకాకుండా మీ రక్తపోటు సాధారణ స్థాయిలో నిర్వహించడానికి సహాయపడుతుంది.సాధారణ కొలెస్ట్రాల్ స్థాయి మరియు రక్తపోటు గుండె వ్యాధులను తగ్గించటానికి దోహదం చేస్తుంది
మెదడు పనితీరు
ఇది వంకాయ యొక్క అతి ముఖ్యమైన ఆరోగ్య ప్రయోజనాలలో ఒకటి.వంకాయ పైటోన్యూట్రియాంట్స్ కలిగి ఉంటుంది. కణ పొరలలో ఎలాంటి నష్టం జరగకుండా సురక్షితంగా ఉంచటానికి సహాయం చేస్తుంది.అంతేకాకుండా ఒక ఆరోగ్యకరమైన మెమరీకి సహాయం చేస్తుంది.
ఇనుము ఓవర్లోడ్ తొలగిస్తుంది
వంకాయను క్రమం తప్పకుండా తీసుకొంటే అదనపు ఇనుమును తొలగించేందుకు సహాయం చేస్తుంది. ఇది పోలి సైతేమియా ఉన్న రోగులలో బాగా ఉపయోగపడుతుంది.వంకాయలో ఉండే నసునిన్ అనే ఒక సమ్మేళనం
జాగ్రత్తలు :
ఎసిడిటీ, కడుపులో పుండు (అల్సర్ ) ఉన్నవారు వంకాయ తినకూడదు,
గర్భిణీ స్త్రీలు వంకాయ తినడము మంచిది కాదు ..ఎలర్జీలకు దారితీయును.
వంకాయ చాలా మందికి దురద, ఎలర్జీని కలిగించును .
శరీరముపైన పుల్లు, చర్మ వ్యాధులు ఉన్నవారు వంకాయ తినరాదు .