జ్ఞానులు మౌనంగా…

Knowledge @pexel
Reading Time: < 1 minute

మూర్ఖులు ప్రతి దానికీ వాదిస్తారు .
జ్ఞానులు మౌనంగా తమ పని తాము చేసుకుంటూ పోతారు .

ఎవరో ఏదో అన్నారు అని మన ప్రయత్నం మధ్యలో వదిలేస్తే సక్సెస్ రాదు ! .

అనే వాళ్ళు మనం ఏం చేసిన అంటారు … ఏం చేయకపోయినా అంటారు .
బురదలో రాయి వేస్తే మన మీదనే పడుతుంది !! .

కావున , ఎవరో ఏదో అన్నారు కదా అని మన ప్రయత్నం ఆపకూడదు .

1997 లో టైటానిక్ సినిమా తీసిన జేమ్స్ కెమేరాన్ మళ్లీ 2009 లో అవతార్ సినిమా తీశారు. అప్పుడు ఒక జర్నలిస్ట్ ఒక ప్రశ్న అడుగుతాడు .

సర్ , టైటానిక్ లాంటి అద్భుతమైన హిట్ ఇచ్చిన మీరు ఇన్ని రోజులు కనపడకుండా పోయారు ??… జనాలు ఏదేదో అనుకున్నారు మీ గురించి , మీరు మళ్లీ ఇన్ని రోజులకు బయటకు వచ్చారు … ఇన్ని రోజులు కనపడకుండా ఎక్కడికి పోయారు ?? .

ఆ ప్రశ్నకు తను ఇలా సమాధానం ఇచ్చారు

” నా పని పూర్తి అయ్యే వరకు నేను మాట్లాడను … నా పని పూర్తి అయ్యాక దాని గురించి జనాలు మాట్లాడుకుంటారు ” అని .

అంటే దీని అర్థం టైటానిక్ సినిమా తర్వాత 12 సంవత్సరాలు కఠోర శ్రమ తరువాత అవతార్ సినిమా తీశాడు , అప్పటి వరకు తను మౌనంగా ఉన్నాడు . అది విడుదల అయిన తర్వాత దాని గురించి పబ్లిక్ మాట్లాడటం స్టార్ట్ చేశారు .

మనం చేస్తున్న పని మీద మనకు క్లారిటీ ఉంటే ఎదుటి వాళ్ళు ఏమన్నా పట్టించుకోవద్దు.

Leave a Reply