దుకాణాల దొర

Reading Time: 2 minutes


ఒక ఊరిలో ఒక దొర ఉండేవాడు. అతనికి వ్యాపారం తప్ప ఏమీ తెలియవు. అతనికి పెద్ద దుకాణాలు చాలా ఉన్నాయి. ఐతే ఒక రోజు ఒక ఆలోచన వస్తుంది. ఆ ఆలోచన ఏంటి అంటే పని లేని వాళ్ళకి వాళ్ళ దుకాణాల్లో పనిని ఇవ్వాలనుకుంటాడు. ఒక రోజు ఒక ఊరికి వెళ్తాడు. ఆ ఊరిలో పని లేని వాళ్ళని చూసి అతని వద్ద ఉన్న దుకాణాల్లో పనికి తీసుకెళ్తాడు.
ఆ ఊరి జనం డోరా గారికి చాలా కృతజ్ఞతలు చెప్తారు. మీ రుణం ఎలా తీర్చుకోవాలో తెలియదు అండి. మా ఊరికి వచ్చి మరి పనిని మాకు కల్పించారు. మీరు ఎక్కడ ఉన్నా చల్లగా ఉండలయ్యా అంటూ ఆ దొరగారిని దీవిస్తారు.


మంచి చేయలనిపించింది కాబట్టి ఆలోచించకుండా దొరగారు మంచి చేశారు.ఇలా మనకి అనిపించినప్పుడు మంచి చేయడమే. ఆ క్షణంలో ఎవరు చెప్పిన కూడా వినకండి. ఆ ఊరిలో ఒకరు వచ్చి మీకు ఇది అంతా అవసరమా అని అడుగుతారు దొర గారిని. అప్పుడు దొర గారు ఈ విధంగా బదులు చెప్తారు.


ఈ రోజుల్లో అందరూ మాటలు మాత్రమే చెప్తున్నారు. చేతల్లో మాత్రం చూపించటలేదు. నేను వచ్చి మాట ఇవ్వలేదు. నా మనసుకి నచ్చింది చేసాను. చెప్పడం ఒక వంతు ఐతే చెప్పిన దాన్ని
చేసి చూపించడం ఇంకో వంతు !!మాట్లాడటం వచ్చు కదా అని ఎక్కడిబడితే అక్కడ మాటలు జారకూడదు ?? అందుకే నోరు అదుపు , మాట పొదుపు అని ఈ విధంగా తాను అడిగిన ప్రశ్న ఘాటుగా జవాబు చెప్తాడు.నిన్న అనేది మనకి చెప్పి వెళ్ళదు ? ఈ రోజు అన్నది మనకి చెప్పి రాదు ? నిన్న గురించి ఆలోచించడం మానేసి ఈ రోజు గురించి ఆలోచించడం మొదలు పెట్టండి అని ఆ ఊరు వాళ్ళకి చెప్పి వెళ్ళిపోతాడు.

Shop Owner Image

మరుసటి రోజు ఊరి వాళ్ళు పని లోకి వస్తారు. దొర గారు వెళ్లి అందరిని పలకరిస్తారు. మీరు అందరూ కలలు కంటారు. కలలు దగ్గరే ఆగిపోతున్నారు. ఒక అడుగు వేస్తే కదా తెలిసేది. మీ అందరికి ఒక మాట చెప్తాను గుర్తు పెట్టుకోండి !! మనిషి కలలు కంటుంటాడు !!కానీ వాటిని నిజం చేసుకోవడానికి మాత్రం ప్రయత్నించడు ?? ప్రయత్నంలో పోయేది ఏమి ఉండదు కదా మరి ఒక్కసారి ప్రయత్నించండి అంటూ వాళ్ళకి చెప్తాడు. ఈ విధంగా ఉంటుంది. మంచి పనులు చేయాలి అనుకున్న వాళ్ళు ఎవరు చెప్పినా కూడా వినరు.

నీతి :- సహాయంలో చిన్న, పెద్ద అని ఏమి ఉండదు.
చేసే పనిలో మంచిని మాత్రమే చూసుకోవాలి.

Leave a Reply