ఒక మాట, ఒక భావం !!

Lord Budha @pexels
Reading Time: < 1 minute

1) దగ్గర ఉన్నపుడు ఏమి అవుతాదిలే అనుకుంటారు ??
దూరం అయ్యాక అదే కావాలంటారు !!

దగ్గర ఉన్నప్పుడు , దూరం అయ్యాక
ఒకేలా మీరు ఉండగలిగినప్పుడే
మీ జీవితం ముందుకు వెళ్తుంది !!!

భావం :- చాలా మంది వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు విలువ తెలుసుకోరు.వెళ్ళిపోయాక నాకు అదే కావాలంటారు. మీ దగ్గర ఉన్న, లేకపోయినా మీరు ఒకేలా ఉండాలి.2) ఏ బంధమైన ” మన ” అనుకుంటే
ఆ బంధానికి ఎక్కడికి వెళ్లినా
విలువ ఉంటుంది !!
” తన ” అనుకుంటే ఎంత దూరం
వెళ్లినా విలువ ఉండదు ???

భావం :- బంధాలు మనల్ని ముందుకు తీసుకెళ్తాయి. ఉన్నది ఒకటే జీవితం కాబట్టి మనము, మనమంతా అని అందరూ అనుకుంటే మంచిది.3) నువ్వు ఇష్టపడినవి నీకే
దక్కాలి …. అని ఎవరికి రాసి పెట్టి ఉండదు ?
దక్కచ్చు ? దక్కక పోవచ్చు ?
అది అంతా దేవుడు ఆడించే
ఒక ” ఆట “
ఆ ఆటలో మనిషికి ఓపిక ఉన్నంత వరకు
ఆడాలిసిందే !!!


భావం :- మనము ఇష్టపడినవి మనకే దక్కాలని ఎప్పుడు అనుకోకుకూడదు. దేవుడు ఎలా రాస్తే అలానే జరుగుతుంది.

Leave a Reply