వంకాయ ఉల్లికారం

Reading Time: < 1 minute

వంకాయ ఉల్లికారం

కూరగాయల్లో వంకాయ కూర చాలా బావుంటుంది. వంకాయతో కూరలే కాదు అండి .
వంకాయతో కారం కూడా చేసుకోవచ్చు. వంకాయ కారం మీరు వినే ఉంటారు. మరి వంకాయ ఉల్లి కారం విన్నారా ? వంకాయతో ఉల్లి కారం ఎలా చేయాలో తెలుసుకుందాము.అలాగే దీనికి కావలిసిన వస్తువులు, తయారీ విధానం గురించి కూడా తెలుసుకుందాము.



కావలిసిన వస్తువులు :-

వంకాయలు – 5 ,
వెల్లుల్లి – 6 రెబ్బలు ,
జీల కర్ర – 1 టీ స్పూను,
కారం – 1 టీ స్పూను,
ఉప్పు – సరిపడినంత,
పసుపు – సరిపడినంత,
నూనె – 3 టీ స్పూన్ ,
ఉల్లికారం – 2 టీ స్పూన్లు .

Brinjal Curry
Brinjal Curry


తయారీ విధానం :-

ముందుగా వంకాయలను కడిగి బాగా శుభ్రం చేసుకోవాలి. కడిగి తుడిచి పెట్టుకోవాలి. ఆ తరువాత ఒక చిన్న గిన్నె తీసుకొని దానిలో ఉప్పు వేసి అలా ఉంచాలి.ఆ తరువాత వెంటనే వంకాయలను తీసుకొని నిలువుగా కోసి వాటిని పక్కన పెట్టుకోవాలి. జీల కర్ర, వెల్లులి , కారం, ఉప్పు,పసుపు తీసుకొని వీటిని నూరుకొని పక్కన పెట్టుకోవాలి. వీటికి ఉల్లి కారం , నూనె వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని తీసుకొని వంకాయల్లో కూరుకొని , వాటిని నూనె లో వేయించుకుని అన్నం లో తినడమే. అంతే వంకాయ ఉల్లికారం రెడీ.

Leave a Reply