నాలుగు మంచి మాటలను తెలుసుకుందాము !!

Learning good @pexels
Reading Time: < 1 minute

చిన్న , పెద్ద అని ఎవరిని తక్కువ చేసి మాట్లాడకండి. ఎవరికి ఉండే ” తెలివి ” వాళ్ళకి ఉంటుంది…! తెలివితో కూడా గెలవచ్చు.ఎవరికి మాట తేలికగా ఇవ్వకండి . ఎందుకంటే చెప్పడం ఒక వంతు ఐతే చెప్పిన దాన్ని చేసి చూపించడం ఒక వంతు !!మాట్లాడటం వచ్చు కదా అని ఎక్కడిబడితే అక్కడ మాటలు జారకూడదు ??
అందుకే నోరు అదుపు , మాట పొదుపు.

ఓ మనిషి ఒకసారి విను .. నీది కానీ దాని కోసం నువ్వు తపిస్తా ఉంటావు !! నీది ఐన దానిని పక్కనే ఉన్నా పట్టించుకోవు ?? నీకు రాసి పెట్టి ఉంటే నువ్వు తపించక పోయిన నీ దగ్గరకే వస్తుంది !! కొంతమంది ఎవరైనా ఏదయినా పని చెప్పినప్పుడు నీకు వచ్చినట్లు చేయడం కాదు వాళ్ళకి నచ్చినట్లు చేయడం నేర్చుకో !!!ఎవరైనా ఏదయినా పని చెప్పినప్పుడు నీకు వచ్చినట్లు చేయడం కాదు వాళ్ళకి నచ్చినట్లు చేయడం నేర్చుకో !!! కొంత మంది మనస్సులో ఒకటి పెట్టుకొని పైకి ఇంకోటి మాట్లాడతారు !! అలాంటి వాళ్ళు ఎక్కడికి వెళ్లినా గెలవలేరు ??ఎందుకంటే వాళ్ళ మాటలే వాళ్ళకి బుద్ధి చెప్తాయి కాబట్టి !!!


” మంచిని” గెలిపించనంత కాలం
” చెడు ” పడుతూనే ఉంటుంది .
మంచి చేయకపోయినా పర్వాలేదు
కానీ చెడు వైపు మాత్రం నిలబడకండి ??
మనల్ని మనమే ఒక్కోసారి మర్చిపోయి కొన్ని సార్లు కాలాన్ని , సమయాన్ని వృధా చేస్తారు.
ఓ మనిషి …!!!
” రోజు ” ఏమో నేను రోజూ వస్తున్నా వెళ్లిపోతున్నా ?
అని అంటుంది ,
” సమయం ” ఏమో నువ్వు బ్రతికి ఉన్నతవరకు నీతోనే ఉంటాను అని అంటుంది !!
మరి మనిషి ఏమో రోజును, సమయాన్ని చూస్తూ
వృధా చేస్తున్నాడు.

Leave a Reply