కాలం విలువ

Value of Time
Reading Time: < 1 minute

కాలం విలువ

కాలం విలువ చాలా మందికి తెలియదు. తెలీసుకోకుండా సనాయన్ని వృధా చేస్తారు. వాళ్ళకి వాళ్ళు తెలుసుకుంటారు అంటే అది కూడా లేదు.
ఒక్కసారి జరిగిపోయిన కాలాన్ని వెనక్కి తిరిగి తీసుకు రాలేము. ఉన్న కాలాన్ని, వచ్చే కాలాన్ని పట్టించుకోరు. మనము ఏదయినా పని చేసేటప్పుడు సమయం, కాలం కూడా అనుకూలించాలి.మీరు ఏమైనా పని చేసేటప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించి ఇది మనకి ఉపయోగ పడుతుందా? లేదా ? అని అది కూడా ఆలోచించండి. ప్రతి మనిషికి కాలం ఒక వరం. మనము ఏమైనా సాధించాలి అంటే కాలం సహకరిస్తేనే లేదు అంటే ఏమి చేయలేము. అలాగే
గడియారంలో ఉన్న గంటల ముళ్ళు.. ఓ మనిషి నీకు ఇరవై నాలుగు గంటల సమయాన్ని ఇస్తున్నా …నువ్వు దాన్ని వృధా చేస్తున్నావు.నీకు కాలం విలువ ఇంకా అర్థం కావటలేదు అంటుంది.

ఏదయినా కష్టంగా ఉంది అనుకుంటే తేలికగా ఉన్నవి కూడా కష్టంగా ఐపోతాయి .అలా అనడం మానేసి , కష్టంగా ఉన్నవి కూడా తేలికే అని అనడం నేర్చుకోండి .ప్రపంచంలో చాలా మంది సమయాన్ని, కాలాన్ని వృధా చేస్తారు. అది వాళ్ళ కోసము కూడా కాదు. ఎదుటి వారి జీవితాలు కోసం. నిజానికి చెప్పాలంటే మీకున్న సమయమే తక్కువ ?వేరొకరి జీవితం కోసం మీ జీవితాన్ని త్యాగం చేసుకోకండి. అలాగే మీకు ఉన్న విలువైన కాలాన్ని కూడా ఎవరి కోసం త్యాగం చేయకండి.

Leave a Reply