మనస్సుకు, మనిషికి చాలా తేడా ఉంది ?

Love Life
Reading Time: < 1 minute


మనస్సుకు, మనిషి కూడా తేడా చాలా ఉంది ?

మనస్సు ఇష్టపడని చోటుకు మనిషి వెళ్లకూడదు ?
మనస్సుకు మాత్రమే తెలుసు మనిషికి ఏది ఇష్టమో !! ఏది కష్టమో ?మనిషికి ఒక్కసారి అనుమానం పుడితే అది ఎప్పటికి పోదు ? అనుమానంలో నిజం ,అబద్ధం రెండు ఉంటాయి !!


ఒక అబద్ధాన్ని నిజంగా నమ్మించి మోసం చేసేదే ” అనుమానం “. మనిషి ఒకరిని ఏడిపించే ముందు మీకు కూడా అలాంటి రోజులు వస్తాయని మాత్రం మర్చిపోకండి. ఉన్నది ఒకటే జీవితం
పది మందితో ఉండండి. అలాగే నీ జీవితాన్ని నీ చేతిలోనే ఉంచుకోండి .వేరే వాళ్ళకి అంకితం చేసినా, ఈ రోజుల్లోగుర్తించే వాళ్ళు అంటూ ఎవరు లేరు. మనస్సుకి వేరే వాళ్ళు నచ్చరు. మనిషికి అలా కాదు . మనిషి చూసిన వాటిలో కొన్ని ఇష్టపడతాడు.

మనిషి ఎంత డబ్బు సంపాదించిన అవి ఏమి తినలేరు. వాటిలో అన్నం మాత్రమే !!!
తినగలరు. ఇంకేమి తినలేరు. సంపాదన కూడా తిండి కోసమే అని ఇంకా తెలుసుకోలేక పోతున్నారు మనుషులు. కానీ మనస్సు అలా కాదు ? ఏ పని చేసిన ఇష్టంగా చేస్తుంది. మనిషి కన్నా మనస్సు ఇష్టపడింది చేయండి.

దూసుకెళ్లే బాణానికే తెలుసు
అది ఎంత వేగంగా వెళ్ళ గలదని,
అలాగే మంచి మనిషికి మాత్రమే తెలుసు
మన దగ్గర ఉన్నది నలుగురికి పంచాలని.
ప్రాణం లేని బాణమే గురి తప్పకుండా
తన పని తాను చేసుకుంటాది.
ప్రాణం ఉన్న మనిషి మాత్రం అడ్డ దారులు
వెతుక్కుంటూ నడుస్తావుంటాడు.

మంచి మనస్సు అందరికి ఉంటుంది .కానీ దాన్ని చూపించాలిసిన దగ్గర చూపించరు. అందుకే కొంత మంది మనుషులు ఇంకో మనిషి వాళ్ళ స్థానాన్ని పోగొట్టుకుంటున్నారు. మీరు మీ లాగే ఉండండి. నటిస్తే ఏ రోజు ఐనా తెలియాలిసిందే కదా !!!

కాబట్టి మనస్సు చెప్పేది కూడా ఒక సారి వినండి.

Leave a Reply