కుందేలు తెలివి

Bunny @pexels
Reading Time: 2 minutes

ఒక ఊరిలో ఒక కుందేలు ఉండేది . అది అడవుల నుంచి తప్పించుకొని ఊరిలోనే చిక్కుకు పోతుంది.


ఆ ఊరిలో వాళ్ళకి దొరకకుండా తప్పించుకుంటాది. ఐతే ఒక రోజు బాగా వర్షం పడతాది . అప్పుడు కుందేలు కు ఏమి చేయాలో కూడా తెలియదు. బయటికి వస్తే ఊరిలో వాళ్ళు వేటాడాతారు. వానలో ఉంటే తడిచిపోతాను.


ఊరిలో వాళ్ళు కుందేలు కోసం వేచి చూస్తా ఉంటారు. చిన్న కుందేలేగా మనము సులువుగా పట్టుకోవచ్చు అని అనుకుంటారు.ఎప్పుడు బయటికి వస్తాదా చూస్తూనే ఉంటారు. అప్పుడు కుందేలుకి ఒక చెట్టు కింద చిన్న పోద కనిపిస్తుంది.ఆ పోద లోకి వెళ్ళిపోతాది.అలా ఆ రోజు తప్పించుకుంటాది.


తరువాతి రోజు అక్కడ నుంచి కుందేలు వేరే చోటుకి వెళ్ళిపోతుంది. ఐతే ఆ ఊరిలో వాళ్లు అందరూ కుందేలు ను పట్టుకోలేక పోయాము. అది పారిపోయే ఉంటాది. ఆ మాటలు అన్ని కుందేలు ఉంటాది. వాళ్ళ ముందే కుందేలు నడుచుకుంటూ వాళ్ళు చూసిన తరువాత కుందేలు పారిపోతున్నట్టు నటించి చెట్టు కింద పోద లో దాక్కొని ఉంటుంది. అలా ఆ ఊరిలో వాళ్ళను మాయ చేసి అలా నటిస్తూ జీవిస్తూ ఉంటుంది.

ఆ ఊరిలో వాళ్ళు ఇప్పుడు నిజంగానే కుందేలు పరిపోయిన్ది. మనము చిన్న కుందేలు కూడా పట్టుకోలేకపోయము. ఈ సారి కుందేలు మన ఉరికి వచ్చిన ఎవరు పట్టించుకోకండి. ఎందుకంటే మనము ఒక కుందేలు తెలివి ముందు మనము ఒడిపోయము. ఇంక మనకు ఆ కుందేలును పట్టుకొనే హక్కు లేదు అని అనుకుంటారు.

కొన్ని రోజులు తరువాత వాళ్ళ అందరి ముందే తిరిగింది .ఇలా కుందేలు ఆ ఊరిలో ఉన్న మనుషుల అందరిని ఓడించి గెలిచింది.

చిన్న , పెద్ద అని తక్కువ చేసి మాట్లాడకూడదు. ఎవరికి ఉండే తెలివి వాళ్ళకి ఉంటుంది.

Leave a Reply