ముసలవ్వ సాయం

Grand Mother @pexels
Reading Time: 2 minutes

ఒక ఊరిలో ఒక ముసలి అవ్వ ఉండేది. ఆమె దోసెలు బాగా వేసేది. ఆమెకు టిఫిన్ షాప్ కూడా ఉండేది. ఆమె వేసే దోసెలు తినడానికి పక్క ఊరి నుంచి కూడా వచ్చేవారు. ఆమె దోసెలు అంత రుచిగా ఉండేవి. ఐతే ఒక రోజు ఆమెకి ఒక ఆలోచన వచ్చింది. తనకి వచ్చిన డబ్బులుతో చిన్న పిల్లలను చదివించాలని నిర్ణయం తీసుకుంటాది. ముసలి అవ్వ తీసుకున్న నిర్ణయం ఆ ఊరు ప్రజల అందరికి నచ్చింది. ఆ ఊరిలో చదివించలేని పిల్లలను తను చదివించేది .కొన్ని రోజులు తరువాత చదివించిన పిల్లలు అందరూ పెద్ద వాళ్ళు అవుతారు. వాళ్ళ తల్లిదండ్రులు ఈ విధంగా ఆలోచిస్తారు. ఇప్పటివరకు ఆ ముసలి అవ్వ మన పిల్లలను చదివించింది కదా ! ఇప్పుడు మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి , మన పిల్లలు ఆ డబ్బులు తీసుకెళ్ళి ముసలి అవ్వ చేతిలో పెడతారు .మనకి ఏమి మిగలవు…అని మాట్లాడుకుంటారు. వాళ్ళు మాట్లాడుకుంటున్న మాటలు అన్ని ముసలి అవ్వ వింటుంది. విన్నా కూడా వాళ్ళని ఒక్క మాట కూడా అడగలేదు. అవి విన్న అవ్వకు బాధ కలుగుతుంది.

Grandma


ఆ తరువాత రోజు మనస్సు ప్రశాంతత కోసం గుడికి వెళ్తుంది . తన గోడును దేవుడు గుడిలో ఈ విధంగా చెప్పుకుంటాది. దేవుడా నేను చేసిన తప్పు ఏంటి ?? వాళ్ళు చదవించలేని స్థితిలో ఉన్నారు అనే కదా నేను చదివిస్తానన్నది .మరి ఆ రోజు ఏ ఒక్కరు మాట్లాడలేదు? ఈ రోజు ఈ విధంగా అంటున్నారు. దేవుడా నాకు తెలిసింది ఒక్కటే నా దగ్గర ఉన్నది పది మందికి పంచడమే తెలుసు .పది మంది దగ్గర లాక్కొని తినే ఆలోచన నాకు ఎప్పుడు లేదు అంటూ బాధ పడుతూ చెప్తాది. ఆ పిల్లలు అందరు మంచిగా బ్రతకాలనే నేను వాళ్ళని చదివించాను. ఆ పిల్లలు నుంచి డబ్బు ను ఆశించలేదు అంటూ తన గోడును దేవుడు దగ్గర చెప్పుకుంటాది. ఆ తరువాత పిల్లలు అందరికి ఉద్యోగాలు వస్తాయి. ఆ పిల్లలు ముందు వాళ్ళ అమ్మా నాన్న దగ్గరికి వెళ్లకుండా ముసలి అవ్వ దగ్గరికి వచ్చి చెప్తారు. ముసలి అవ్వ చాలా సంతోష పడతాది. అప్పుడు ముసలి నా దగ్గరికి కాదు ముందు మీ అమ్మా నాన్నలకు దగ్గరికి వెళ్ళి చెప్పండి .వాళ్ళు కూడా సంతోషిస్తారు. అప్పుడు పిల్లలు మీరు మమ్మల్ని చదివించడానికి చాలా కష్ట పడ్డారు అవ్వ. మీ కష్టాన్ని మేము జీవితంతాము గుర్తు పెట్టుకుంటాము అని చెప్తారు. అప్పుడు వాళ్ళ తల్లి తండ్రులు ముసలి అవ్వకు క్షమాపణ చెప్పి వాళ్ళ పిల్లలను తీసుకెళ్తారు .

ఈ రోజుల్లో నిజంగా సాయం చేసిన అది చేడుకే వస్తాది.

Leave a Reply