వ్యాపార విజయం

Secret of Business
Reading Time: 2 minutesఒక ఊరిలో ఒక చిన్న కుటుంభం ఉండేది. ఆ కుటుంభంలో అమ్మ ,నాన్న , ఒక కొడుకు ఉండే వాళ్ళు . వాళ్ళకి పూట గడవడానికి కూడా చాలా కష్టంగా ఉండేది. పని కూడా ఒక రోజు ఉంటే ఇంకో రోజు ఉండేది కాదు. చాలా బాధలు పడతారు. వాళ్ళు ఇంక ఇలా ఐతే మనము ఏమి సంపాదించలేము . సంపాదించింది మన తిండికి కూడా సరిపోవటలేదని బాధ పడుతూ ఉంటారు. అప్పుడు తండ్రి మనము ముందు బాగా కష్ట పడదాము. ఆ తరువాత దేవుడే ఒక దారి చూపిస్తాడు అంటూ కుటుంభం బరువుని తన మీద వేసుకొని ముందుకు నెట్టుకొస్తారు . అమ్మానాన్నలకి తెలియకుండా వాళ్ళ కొడుకు బాధలను తెలుసుకుంటాడు .ఈ వయసులో నేను ఏమి చేయగలను అమ్మా నాన్నలకు, ఒక ఆలోచనని మాత్రమే చెప్పగలను అని అనుకుంటాడు మనసులో. సమయం వచ్చినప్పుడు చెప్తాను అని అనుకుంటాడు. తండ్రికి కూడా ఒక ఉపాయం వస్తుంది. ఏదయినా చిన్న వ్యాపారం పెట్టుకుందాము. దాని మీద ఐన డబ్బులు సంపాదించుకోవచ్చు .కొంచం మిగిలితే కొడుకును బాగా చదివిద్దామని అనుకుంటారు. అలాగే వచ్చిన డబ్బులు కొడుకు పేరున బ్యాంక్ లో వేద్దామని ఆలోచిస్తారు

ఇంతలో అక్కడికి కొడుకు వస్తాడు. ఏంటి నాన్న ఏమి ఆలోచిస్తున్నారు. నా గురించేనా అని అడుగుతాడు కొడుకు. అప్పుడు తండ్రి కాదు బాబు ఏదయినా వ్యాపారం పెట్టుకుందామా అని ఆలోచిస్తున్నా అని జవాబు ఇస్తాడు. ఇంతలో బాబుకి ఒక ఆలోచన వస్తుంది. నాన్న మా స్కూల్ దగ్గర పానీ పూరి బండి పెట్టుకుంటే మనకి బాగా లాభం వస్తుంది అని చెప్తాడు. తల్లి కూడా ఆలోచించి అవును, ఇదే మంచి మార్గం . చాలా మందికి పానీ పూరి అంటే ఇష్టం. దీన్ని తినడానికి పిల్లలు కూడా బాగా వస్తారు. మనము వెంటనే ఈ బండిని పెట్టుకుందామని చెప్తుంది. ఆ తరువాత వాళ్ళ అప్పు తీసుకొని బండిని మొదలు పెడతారు.


బండిని పెట్టుకున్న కొద్ది రోజుల్లోనే వాళ్ళకి బాగా డబ్బులు వస్తాయి. తీసుకున్న అప్పును కూడా తీర్చేస్తారు. లాభంగా వచ్చిన డబ్బును కొడుకు పేరు మీద బ్యాంక్ లో వేసి, కొడుకును పెద్ద చదువులు చదివిస్తారు.ఆ తరువాత వాళ్ళు పెద్ద పెద్ద వ్యాపారాలు కూడా చేస్తారు.వాళ్ళ కుటుంభం అంతా సంతోషంగా ఉన్నారు .ఇలా వాళ్ళు ఎవరి సహాయం లేకుండా జీవితంలో గెలిచారు. ముందు ఎంత కష్ట పడితే ఆ తరువాత అంత సుఖ పడతారు. జీవితం వాళ్ళకి పరీక్షలు పెట్టింది. వాళ్ళు నిలబడి తట్టుకొని గెలిచారు. బాబుకి వచ్చిన ఒక్క ఆలోచన జీవితాన్నే మార్చేసింది.ఎవరిని తక్కువ అంచనా వేయకూడదు. ఎవరికి ఉండే ఆలోచనా శక్తీ వాళ్ళకి ఉంటాయి .

Leave a Reply