ఆలోచనా శక్తి

ఆలోచనా శక్తి
Reading Time: 2 minutes

మనిషికి, మనిషి ఆలోచించే విధానానికి చాలా తేడా ఉంది. ఎలా అని అంటారా ??
మనము ఒకటి ఆలోచిస్తే , మన మెదడు ఇంకోటి ఆలోచిస్తాది. ఈ రెండింటికి పొంతనే ఉండదు ??


మీ లోనే ఇద్దరు మనుషులు ఉన్నట్లు అనిపిస్తుందా మీకు ? మరి అంతే కదా అండి. ఉదాహరణకు ఒకటి చెప్పుకుందాము . మనకి సినిమా చూడలనిపించింది అనుకోండి. అదే సమయానికి మీ అమ్మ గారు కూరగాయలు తీసుకురమ్మని బయటికి పంపించారు. ఆ సమయంలో మీరు ఏమి చేస్తారు. వెంటనే మీ అమ్మ గారు చెప్పిన పనిని చక చక చేసేస్తారు. మీకు ఇష్టం లేని చోట మీరు వెళ్లి కూరగాయలు కూడా తీసుకొచ్చారు.కానీ మీకు ఇష్టమైన సినిమా ఇంకా చూడలేదు. మీరు ఒకటి అనుకున్నారు. మీ మనస్సు ఇంకోటి చేపించింది. అక్కడ మీకు ఏమైంది అంటే ఆలోచన శక్తి తగ్గి మీ అమ్మ గారు చెప్పిన మాట ఒక్కటే గుర్తు పెట్టుకొని ఆ పని ముందు చేశారు. నిజానికి చెప్పాలంటే మీ మెదడుకి పని చెప్పారు కానీ, మీ మనస్సుకి చెప్పలేదు. మనిషి ఏదైనా ఇష్టపడితే మన మనస్సు మనకి తెలియకుండానే దాని దగ్గరకు వెళ్ళిపోతుంది.



ఆలోచించే విధానం కూడా మనము మార్చుకోవాలి . మనము ఇష్ట పడినవి అన్ని మనకి దక్కవు. అవి మనకి దక్కలేదు అంటే మనవి కానట్లే. చాలా మంది ఇష్ట పడినవి దక్కలేదని బాధ పడుతుంటారు. మీరు ఏమి బాధ పడకండి. ఒకటి దక్కలేదంటే అంత కన్నా మిమ్మల్ని ఇష్ట పడే వాళ్ళు ఖచ్చితంగా మీ జీవితంలో కి వస్తారు దక్కుతున్నాయని అర్థం. అంత వరకు సహనంతో ఉండండి. మనిషి బాధ పడే కొద్ది బాధలే వస్తాయి.ఈ ప్రపంచంలో బాధలు లేని మనుషులే ఉండరు. అక్కడ మీరు బాధ పడుతున్నారు అంటే మీ ఆలోచనా విధానాన్ని మీరు మార్చుకోలేక పోతున్నారు. దేనినైనా మార్చ గలిగే శక్తి ఆలోచనకి ఉంది. కాబట్టి ఆలోచించేది శాంతగా ఆలోచించండి.


మనిషి అనుకుంటే చేయలేని పని అంటూ ఏమి ఉండదు. అలాగే మీరు మీ ఆలోచన విధానాన్ని మార్చుకోలేక పోతే మీ కోసం ఒక చిట్కా చెబుతాను. అలానే చేయండి మీరు కూడా.మనిషి ఆలోచన విధానాన్ని అలవాటు చేసుకోవాలంటే , 21 రోజులు వరస పెట్టి ఆలోచనలో మార్పులు తీసుకురావాలి. ఈ 21 రోజుల్లో వేగంగా ఆలోచించే శక్తి కొంచం పెరుగుతుంది. దీన్ని మీ మెదడు ఎప్పటికి మర్చిపోదు. ఎందుకంటే మీ మెదడు, మీ ఆలోచన విధానం, మీ మనస్సు మీ ఆధీనంలోకి వచ్చేస్తాయి.

Leave a Reply