మధ్యతరగతి మనుషుల ఆవేదన

Reading Time: 2 minutes

40వేలు జీతంతో చావలేక బతుకుతున్న మధ్య తరగతి మనిషి… అంతరంగం…

నువ్వు నిజాయితీగా కట్టే TAX వల్ల…

అమ్మ ఒడి 15000 నీకు రాదు.ఐటీఐ,డిగ్రీ చదివే పిల్లలువుంటే వసతి 15000 రాదు…
రైతు భరోసా 12000 రాదు….
పంట కోసం రుణం తీసుకుంటే రుణమాఫీ నీకు రాదు..టైం బాగా లేక పంట సరిగా పండక పోతే మద్దతు ధర నీకు రాదు….

బియ్యం కార్డు నీకు రాదు (20kgx50rsx12months)–12000 పెట్టి బియ్యం కొనాల్సిందే

ఉగాదికి ఇళ్ల స్థలం నీకు రాదు
ఇల్లు కట్టాలంటే ప్రభుత్వం ఇచ్చే 2లక్షల రూపాయలు నీకు రాదు.

డబుల్ బెడ్ రూమ్ ప్లాట్ నీకు ఇవ్వరు.

ఆరోగ్య శ్రీ కార్డ్ నీకు యివ్వరు.
ఎంత బిల్లు ఆయినా నువ్వు కట్టాల్సిందే.

నీకు ఇన్ కమ్ సర్టిఫికెట్  ఉంది కాబట్టి నీ పిల్లల ఫీజు… నువ్వు కట్టాలి…
ఇక నీపిల్లలు ఇంజనీరింగ్/ MBBS చదువు? ఒక కల

అందుకే పని పాట మానేసి ఊరికే ఉంటే …
టాక్స్ కట్టే పని లేదు ….ప్రభుత్వం నుండి నిరుద్యోగ భృతితోపాటు పైన నేను చెప్పినవన్నీ పొందొచ్చు….

కష్టపడి జాబ్ చేసి…సంవత్సరం చివర నీకు మిగిలింది GB
నెలకు జీతం 40 వేలు అనుకో

ఇంటి అద్దె 6000
పాలు.1800.1లీ” 60 రూ
కరెంట్ బిల్. 1000
రైస్ 50 kg x50rs 2500
కూరగాయలు 1000
ఆయిల్..వగేరా. 3000
సండే చికెన్. 4వాx200. 800
కార్ లేక బైక్ పెట్రోల్.3000- 5000
పిల్లల ఫీజు. 2000×2 నెలకి
(LKG కూడా 2వేలు కాబట్టి ఒక్కడికి)
(నాకు ఇద్దరు పిల్లలు కాబట్టి నెలకు 4000 వేలు)

పిల్లలకి ప్రతి నెల హాస్పిటల్స్ కి ..2000 అవుతాయి..

ఆరోగ్య శ్రీ లేదుగా ఇన్సూరెన్స్ కట్టాలి…
నెలకు 4 మందికి 4000.

ఇప్పటికే 30 వేలు అయి0ది.. నెలకు మినిమం ఖర్చు….ఇక పండగలు పెళ్లిళ్లు/ బర్త్ డే లు

అమ్మ వాళ్ళ ఊరు…
అత్తగారి ఊరు ప్రయాణాలు…ఖర్చులు….

ఇవన్నీ కాక….40వేల జీతం కదాఅని భార్య వచ్చి

మంచి ఫోన్ కొను,
ఏసీ కొను,
ఫ్రిడ్జ్ కొను,
వాషింగ్ మెషీన్ కొను
సోఫా కొను
గోల్డ్ కొను
భూషణం కొను
అంటే ఉంటాయా…….ఏమన్నా అంటే
40వేలు జీతం ఎమ్ చేస్తావ్ అంటారు…

సరే…ఏదో అడుగుతుందిగా అని BANKకి వెళితే ….టాక్స్ రిటర్న్స్ కట్టిన కాగితాలు తీసుకురా అంటారు…

ఏమి మిగిలింది అని టాక్స్ కట్టడానికి….40వేలు అయిపోయి …పక్కన ఫ్రెండ్ ని అడుగుదాం అంటే వాడిపరిస్తితి అంతే….

సరే అడిగింది కదాఅని బజాజ్ EMI లోకొంటే మళ్ళా నెలనెలా వాడి గోల.. కాస్త జీతం లేటైతే.. ఎవర్ని అడిగినా…ఇదేమాట…నేను కట్టాలి బ్రో అని

ఎలాగోలా టాక్స్ కడుతూ నెట్టుకొస్తుంటే ఒక రోజు ఫంక్షన్ కి చుట్టాలు వచ్చి…
#అయ్యా 40వేలు జీతం కదా …
స్థలం కొన్నవా….
ఇల్లు కట్టావా అని…. ..
(ఏందిరా ఈగోల….) 40వేల జీతంతో స్థలం కొనలేం…ఇల్లు కట్టలేం…

ప్రభుత్వం స్థలం ఇవ్వదు…. నేను కొనలేను..

ప్రభుత్వం డబుల్-బెడ్-రూమ్ ఇల్లు ఇవ్వదు….
నేను కట్టలేను…

40వేలు జీతంతీసుకుని నేను పొడిసింది ఏంది…..

జాబ్ మానేసి…..ఖాళీగా ఉంటే….
పైన చెప్పిన వన్నీ వస్తాయి….ఏ గోల ఉండదు…..

ఇంకొక ముఖ్య విషయం

చిన్నప్పటి నుంచి గవర్నమెంట్ స్కూల్లో చదివి గవర్నమెంట్ హాస్పిటల్ లో చికిత్స పొంది అన్ని ఫ్రీ గా పొంది ఇప్పుడు పరాయి దేశాలకు వెళ్లి ఉద్యోగం చేసుకునే వాళ్లందరికీ ఈ పైన చెప్పినవి అన్నీ దొరుకుతున్నాయి ఎంత విచిత్రమో….. ఇదండీ మన భారతదేశంలో బ్రతుకు ఉన్నటువంటి మధ్యతరగతి మనుషుల ఆవేదన ఆక్రందన…

Leave a Reply