admin@chandamama.in

ఓ మనిషి ఓ మనిషి

ఓ మనిషి ఓ మనిషి
ఏమయ్యాయి నీ డబ్బులు
ఏమయ్యాయి నీ బంగళాలు
ఏమయ్యాయి నీ కార్లు
ఏమయ్యాయి నీ బంగారు ఆభరణాలు
ఏమైనది నీవు సంపాదించిన లంచగొండిసొమ్ము

●●ఏ కారులో వెళ్లగలవు బయటికి నేడు
●●ఏ విమానంలో బయటకు వెళ్లగలవు నేడు
●●ఏ షిప్లో బయటకు వెళ్లగలవు నేడు
●●ఎవడు తాకుతాడు నిన్ను ఈరోజు

◆◆ఏమవుతుంది నీవు కూడబెట్టిన వేల ఎకరాల భూమి
◆◆రోడ్డుకు ఇరువైపులా పచ్చని పొలాలు మాయం చేస్తివి
◆◆పేదోడు వంద గజాల భూమి కొనుక్కునే పరిస్థితి చేజారిస్తివి
◆◆పచ్చదనం కాలరాస్తివి పైసలకు కకృతు పడితివి
◆◆ఏమవుతాయి నీ వందల ఎకరాల నేడు

■■అంతరాలు పెంచితివి
■■ఆత్మీయత తుంచితివి
■■డబ్బే సర్వస్వం అనుకుంటివి
■■డబ్బులిచ్చి ఆపగలవా కరోనాను…
■■భూములిచ్చి ఆపగలవా కారోనాను….
■■లంచమిచ్చి ఆపగలవా కారోనాను…..
■■మనిషిని మనిషిగా చూడవైతివి….
■■నేడు నిన్ను కాపాడడానికి మళ్లీ మనిషే (డాక్టరు) కావాలి.

★★డబ్బులున్నోడికి ఓ మర్యాద
★★డబ్బులు లెనోడికి ఓ మర్యాద
★★నడిచొస్తే ఓ మర్యాద
★★కార్లోవస్తే మరొక మర్యాద
★★గోచి పెడితే ఒక మర్యాద
★★సూటు వేస్తే మరొక మర్యాద
★★నీవ్వు పోయినపుడు నీ వెంట ఏది రాదు అని తెలుసుకో
★★మానవా ఇకనైనా నీ బుద్ది మార్చుకో అందరినీ కలుపుకో

Leave a Reply

Your email address will not be published.

11 − = 6

Related Post

అంటురోగం కన్నా… అధైర్యమే ప్రమాదకరం!అంటురోగం కన్నా… అధైర్యమే ప్రమాదకరం!

మానవాళికి అంటువ్యాధుల ముప్పు ఈనాటిది కాదు. మానవుడు ప్రకృతికి విరుద్ధంగా నడుచుకున్నా, జీవరాశులన్నిటితో స్నేహంగా మెలగకపోయినా ఉత్పాతాలు తప్పవు. ఇది గౌతమ బుద్ధుడు ఏనాడో చేసిన హెచ్చరిక! బుద్ధుడు మగధ రాజధాని రాజగృహలో ఉన్న రోజులవి. ఒకనాడు కొందరు బాటసారులు ఆయన

మన జీవిత పరమార్ధంమన జీవిత పరమార్ధం

మ్తెడియర్ మాష్టర్స్ .మన జీవిత పరమార్ధం. రుచించక పోయినా ఇదే యదార్థం! మూసిన కన్ను తెరవకపోయినా, తెరిచిన కన్ను మూయకపోయినా, శ్వాస తీసుకుని వదలకపోయినా, వదిలిన శ్వాస తీయకపోయినా, ఈ లోకంలో ఈ జన్మకు అదే చివరి చూపు! మనం ఎవ్వరం

ఉపాధ్యాయులను గౌరవంగా చూద్దాంఉపాధ్యాయులను గౌరవంగా చూద్దాం

DEO వచ్చారు ఆయనను చూసిన HM పరుగెత్తి వెళ్ళి ఆహ్వానించారు. ఇది చూసిన ఒకపిల్లవాడు DEO గొప్ప వాడు అనుకున్నాడు. కొంత సేపటికి CEO వచ్చారు. అది చూసిన ఇద్దరు ఎదురు వెళ్ళి ఆహ్వానించారు. ఆపిల్లవాడు CEO నే గొప్పవాడు అనుకున్నాడు.

జనతా కర్ఫ్యూ వల్ల ఫలితం ఏమిటి?జనతా కర్ఫ్యూ వల్ల ఫలితం ఏమిటి?

కరోనా వైరస్ బ్రతికుండే జీవితం కాలం ఒక ప్రదేశంలో గరిష్టంగా 12 గంటలు.. జనతా కర్ఫ్యూ 14 గంటలకు ఉంటుంది.. జనసాంద్రత ఎక్కువగా ఉండే స్థలాలు, జనసమూహం ఎక్కువగా చోట్లల్లో లేదా పబ్లిక్ పాయింట్లలో కరోనా ఉండవచ్చు, అలాంటప్పుడు ఆ వైరస్

నలభై ఏళ్ల వయసు to తొంభైఏళ్ల వయసునలభై ఏళ్ల వయసు to తొంభైఏళ్ల వయసు

నలభై ఏళ్ల వయసులో.. ఉన్నత విద్యావంతులు.. సాధారణ విద్యావంతులు.. ఇద్దరూ సమానమే. సంపాదనలో ఎదుగుదలను మాత్రమే సమాజం గమనిస్తుంది. యాభై ఏళ్ల వయస్సులో.. అందమైన దేహం.. అందవిహీనం.. మద్య తేడా.. చాలా స్వల్పం. శరీరంమీద మచ్చలు ముడతలు దాచిపెట్టలేం. ఇప్పటివరకు అందంతో

అమ్మవారి కుంకుమ పూజ ఎవరు చేయాలిఅమ్మవారి కుంకుమ పూజ ఎవరు చేయాలి

అమ్మవారి కుంకుమ పూజ ఎవరు చేయాలి…………!! అమ్మవారి కుంకుమ పూజ ఎవ్వరైనా చేయచ్చు, పిల్లలు చేస్తే అమితంగా ఆనందపడుతుంది మగవారు చేస్తే వీడు నా బిడ్డ అని ఆశీర్వదిస్తుంది స్ట్రీలు చేస్తే ! వారిలో.. అమ్మవారు తన రూపాన్ని చూసుకుంటుంది అవును