ప్రసాదాల లోగుట్టు – Medical Benefits of Hindu Prasadam

Reading Time: 2 minutes
Food Offered to God or Prasadam
Food Offered to God or Prasadam

ప్రతి ప్రసాదానికి విశిష్టత ఉంది . ఈ ప్రసాదాల్లో ఉన్న మిశ్రమాలు ఆరోగ్యానికి చేసే మేలు అంతా ఇంతా కాదు .

జీర్ణశక్తిని పెంచే ‘ కట్టె పొంగళి
” బియ్యం , పెసరపొప్పు , జీలకర్ర , ఇంగువ , నెయ్యి , అల్లం , శొంఠిపొడి , ఉప్పు , కరివేపాకు , జీడిపప్పుల మిశ్రమంలో తయారయ్యే కట్టెపొంగలి రోగనిరోధకశక్తిని , జీర్ణశక్తిని పెంచు తుంది . మంచి ఆకలిని కలిగిస్తుంది .

జీర్ణకోశ వ్యాధుల నివారిణి ‘ పులిహోర
‘ బియ్యం , చింతపండుపులుసు , శనగపప్పు , మినపప్పు , ఆవాలు , జీలకర్ర , ఎండుమిర్చి ఉప్పు , ఇంగువ , పసుపు , బెల్లం , నూనె , వేరుశన గలు , జీడిపప్పు మిశ్రమంతో తయారు చేసే పులిహోర జీర్ణశక్తిని పెంచుతుంది . జీర్ణకోశ వ్యాధులను నివారిస్తుంది .

మేధస్సును పెంచే దద్ధోజనం
‘ బియ్యం , పెరుగు , ఇంగువ , కొత్తిమీర , అల్లం , – మిర్చి కొంఠి పొడిల మిశ్ర మంతో తయారు చేసే ఈ – ప్రసాదం మేధస్సును పెంచుతుంది . శరీరానికి కి మంచి శక్తిని ఇచ్చి ఆరో గ్యాన్ని కల్గిస్తుంది .

వార్ధక్యాన్ని నిలువరించే ‘ కదంబ ‘
బియ్యం , చింతపండు , ఎండుమిర్చి పోపులు , ఇంగువ , నూనె , ఉప్పు , కందిపప్పు పసుపు , బెల్లం , నెయ్యి , బెండకాయ , వంకాయ , గుమ్మడికాయ , చిక్కుళ్లు , బీన్స్ , దోసకాయ , క్యారెట్ , టమోటా , చిలకడదుంపల మిశ్రమంలో తయారు చేసే కదంబ ప్రసాదం అత్యంత బలవర్థకం . సప్తధాతువుల పోషణ చేస్తుంది . వార్ధక్యాన్ని నిలువరిస్తుంది . అన్ని వయస్సుల వారికి మంచి పౌష్టికాహారం .

శ్లేష్మాన్ని తగ్గించే ‘ పూర్ణాలు “
పచ్చిశనగపప్పు , బెల్లం , కొబ్బరి చురుము , యాలకుల మిశ్ర మంతో ఈ ప్రసాదం సప్తధాతు వుల పోషణ చేస్తుంది . శ్లేష్మాన్ని తగ్గిస్తుంది . మంచి బలవర్ధకం .

రోగనిరోధకశక్తిని పెంచే చలిమిడి
‘ బియ్యం పిండి , బెల్లం , యాలుకలు , నెయ్యి , పచ్చకర్పూరం , జీడిపప్పు , ఎండుకొబ్బరికో రుతో తయారుచేసే చలిమిడి మంచి బలవర్ధకం

కొబ్బరి పాల పాయసం
కొబ్బరి పాలు పచ్చ కర్పూరం యాలకుల పొడి బాదంపప్పు కుంకుమపువ్వు పంచదార ఆవు పాలు కలకండ పొడి తో చేసే ఈ ప్రసాదం వెంటనే శక్తినిస్తుంది. మంచి బలవర్ధకం. శ్రేష్మాన్ని హరిస్తుంది.

Leave a Reply