ఉపాధ్యాయులను గౌరవంగా చూద్దాం

Reading Time: < 1 minute
Teacher is the best role model
Teacher is the best role model

DEO వచ్చారు ఆయనను చూసిన HM పరుగెత్తి వెళ్ళి ఆహ్వానించారు. ఇది చూసిన
ఒకపిల్లవాడు DEO గొప్ప వాడు అనుకున్నాడు.

కొంత సేపటికి CEO వచ్చారు. అది చూసిన ఇద్దరు ఎదురు వెళ్ళి ఆహ్వానించారు. ఆపిల్లవాడు CEO నే గొప్పవాడు అనుకున్నాడు.

కొంత సేపటికి JD వచ్చారు. ఇది చూసిన ముగ్గురు వెళ్ళి ఆహ్వానించారు. ఆ పిల్లవాడు JDయే గొప్పవాడు అనుకున్నాడు.

కొంతసేపటికి విద్యాశాఖమంత్రి వచ్చారు. అందరూ వెళ్ళి విద్యాశాఖ మంత్రిని ఆహ్వానించారు.
ఆపిల్లవాడు అందరి కంటే విద్యాశాఖ మంత్రి గొప్పవాడు అని అనుకున్నాడు.

Function అయిన తరువాత విద్యాశాఖ మంత్రి ప్రక్క సందులో నడచి వెళ్ళాడు. కూడా మిగత నలుగురు కూడా వెళ్ళారు.

సందులో ఒక గుడిశ ఇంటిలోనికి అందరూ వెళ్ళారు. అక్కడ పాత మంచం మీద ఒక పెద్దాయన పడుకుని ఉన్నారు. ఆయనతో మంత్రి అయ్యా నేను ముత్తుని వచ్చి ఉన్నాను అన్నారు.

అందుకు ఆపెద్దాయన ఏముత్తు అని అన్నారు. అయ్యా మీదగ్గర చదివిన ముత్తుని. అప్పుడప్పుడ నన్ను అల్లరివాడివి అనేవారు. తుంటరివాడా అనేవారు. ఆతుంటరి వాడిని ఇప్పుడు మంత్రిగా ఉన్నాను అని చెప్పి ఆపెద్దాయన కాళ్ళకు నమస్కరించాడు.

ఇదంతా చూస్తున్న పిల్లవాడు లోకంలో ఉపాధ్యాయుడే అందరి కంటే గొప్ప వాడు. అందువలన నేను బాగా చదివి మంచి ఉపాధ్యాయుడు అవుతానుఅని అనుకున్నాడు.

ఉపాధ్యాయులను గౌరవంగా చూద్దాం. వారు నడచిన దారిలో నడుద్దాం.

Teacher Is A Builder Of the Nation

Leave a Reply