admin@chandamama.in

భారతీయ కమ్యూనిస్టుల వాస్తవ ముఖము

sitaram yechury

ఈరోజు కాలేజీ నుండి ఇంటికి వస్తుంటే దారిలో ఒక పది , పదిహేను మంది కమ్మ్యూనిస్టు అభిమానులు ” ట్రంప్ గో బ్యాక్ ” అని నినాదాలు ఇస్తూ కనిపించారు.

వాళ్ళ నాయకుడు సీతారం యేచూరి , ఆయన పార్టీ CPM మరికొన్ని కమ్మ్యూనిస్టు సంస్థలు , ఈ రోజూ దిల్లీ లోని జంతర్ మంతర్ దగ్గర ” అమెరికన్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా ” ఒక కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ సంధర్భంగా నాకు గుర్తుకొచ్చిన కొన్ని విషయాలు వ్రాస్తున్నాను. సీతారాం యేచూరి గారి కి ఇద్దరు సంతానం . అమ్మాయి UK [ అంటే ఇంగ్లాండు లో భాగంగా వుండిన స్కాట్ లాండ్ ] లో St. Edinburgh University లో టీచర్ గా పని చేస్తున్నది , కొడుకు అమెరికా లో ఒక ప్రముఖ Multinational company లో ఉద్యోగం చేస్తున్నాడు.

అటు అమెరికా , ఇటు ఇంగ్లాండు .. రెండూ కమ్మ్యూనిస్టులు తీవ్రంగా వ్యతిరేకించే క్యాపిటల్లిస్టు దేశాలే. మరి వారి పిల్లలు మాత్రం ఆ క్యాపిటలిస్టు దేశాలో ఉద్యోగాలు చేస్తూ డబ్బులు సంపాదిస్తున్నారు. అమెరికా , ఇంగ్లాండు లాంటి కమ్మ్యూనిస్టు -వ్యతిరేక దేశాలిచ్చే డబ్బులు తమ కుటుంబాలకు కావాలి , కానీ ఇండియా లో వీధులోకొచ్చి అమెరికా డౌన్ డౌన్ అంటారు.

ఇదో విడ్డూరం కాదా ? క్యాపిటలిస్టుదేశాలను మీరు అంతగా వ్యతిరేకిస్తుంటే అక్కడికిమీ పిల్లలను ఎందుకు పంపారు ? ఏ చైనా కో , రష్యాకో , ఉత్తర కొరియా కో పంపలేకపోయారా ? ఏం , అక్కడ అవకాశాల్లేవా ? లేక ఆదేశాల్లో మీరు సంతోషంగా , స్వేచ్చగా , నిర్భయంగా వుండలేమనీ మీక్కూడా తెలిసిపోయిందా ?

తెలుగు లో శ్రీ శ్రీ గారు ఒక గొప్ప కవి. ఆయన కొడుకుల్లో ఒకాయన పేరు శ్రీరంగం వెంకట్. అతను అమెరికా లో వున్నపుడు , తన తండ్రిని ఒక సారి అమెరికా తీసుకెళ్ళి అక్కడి ప్రదేశాలు , పరిస్థితులను చూపాడు.

” నాన్న గారూ , చూడండి క్యాపిటలిష్టు అమెరికా ఎంత గొప్ప అభివృద్ధి ని సాధించింది ! మీరు చెప్పే స్వేచ్చ , సమానత్వం , కూలీలనేవాళ్ళు లేని సమసమాజం ఇక్కడ కనిపిస్తున్నది కదా , ఇకనైనా మీ కాలంచెల్లిపోయిన కమ్మ్యూనిష్టు సిద్ధాంతాలను వదిలేయలేరా ? ఇంత ప్రగతి , స్వేచ్చ కమ్మ్యూనిష్టు దేశాల్లో ఎక్కడ ? ” అని అంటే

అందుకు శ్రీ శ్రీ గారు ” ఇన్నేళ్ళపాటు తెలిసో తెలియకో ఈ కళ్ళద్దాలనే వాడుతున్నాను , ఇక ఈ వయసులో మార్చుకొని సాధించేది ఏముందిలే , ఇలానే గడచిపోనీ ” అని నిర్వేదంగా అన్నారని ఒక చోట చదివినట్టు నాకు గుర్తు.

తమ పిల్లలు సంపన్న దేశాల్లో వుండాలి , భారత్ లో పేదలు మాత్రం పేదలుగానే మిగలాలి. చెప్పేదొకటి , చేసేదొకటి . విలువల కోసం ఎన్నడూ రాజీ పడని పుచ్చలపల్లి సుందరయ్య , శంకరన్ , తరిమెల నాగిరెడ్డి , శ్రీపాద డాంగే లాంటి నిజమైన కమ్మ్యూనిస్టులతోనే ఇండియా లో కమ్మ్యూనిజం మరణించింది.

అందుకే ఇపుడు భారత్ లో కమ్మ్యూనిస్టులు తమ ఉనికినే కోల్పోతున్నారు.

మొన్న దిల్లీ అసెంబ్లీ కి జరిగిన ఎన్నికల్లో AAP కు 53.57 % , BJP కి 38.51 % ఓట్లు వస్తే , CPI కి 0.02 % , CPM కు 001 % ఓట్లు పడ్డాయి.

Leave a Reply

Your email address will not be published.

35 + = 39

Related Post

కోతుల సహజ మరణాన్ని మీరెప్పుడైనా చూసారా?కోతుల సహజ మరణాన్ని మీరెప్పుడైనా చూసారా?

కోతుల సహజ మరణాన్ని మీరెప్పుడైనా చూసారా… వాటికి.. వారం ముందే మరణం .. అని తెలిసిపోతుంది. అలా తెలుసుకున్నాక అవి ఎవరి కంటా పడకుండా… సంచారంలేని చోట… ఏ ఆహారము తీసుకోకుండా తనకు కావాల్సినంత గుంతను తీసి.. అందులో పడుకుని ఉండిపోతాయి.

శ్రీరామనవమిశ్రీరామనవమి

శ్రీరామనవమి ఏప్రియల్ 2న రాముడి పుట్టినరోజు, సీతా రాముల పెళ్లిరోజు చైత్ర నవమి,శ్రీరామనవమి’ హిందువులకు ఒక ముఖ్యమైన పండుగ. శ్రీరాముడు వసంత ఋతువులో చైత్ర శుద్ధ నవమి, గురువారము నాడు పునర్వసు నక్షత్రపు కర్కాటక లగ్నంలో సరిగ్గా అభిజిత్ ముహూర్తంలో అంటే

ఆడపిల్ల తండ్రికి వందనంఆడపిల్ల తండ్రికి వందనం

ఒకరోజు ఒకతండ్రి తన కూతురుతొ ఒక చిన్న వాగును దాటుతున్నాడు. ఆసమయంలో తండ్రికి చిన్న సందేహం కలిగింది. ఆ వాగు ప్రవాహంలో తన కూతురు ఏమవుతుందో అని ఆ పాపతో ఇలా అన్నాడు… “చిన్న తల్లీ… నా చేయి గట్టిగా పట్టుకొని

శాంతికి నిలయ దేశం-నా భారత దేశంశాంతికి నిలయ దేశం-నా భారత దేశం

మీరు గమనిస్తే భారత్ ఓ ప్రాచీన దేశం. అది ఎంత? 900 సంవత్సరాల ముందు వరకు అమెరికా లేదు … కొలంబస్ తెలిపాడు ప్రపంచానికి !2000 సంవత్సరాల ముందు వరకు ఇజ్రాయిల్ లేదు … ఏసు అనే వ్వక్తి తెలిపాడు ప్రపంచానికి5000

శ్రీకృష్ణం వందే జగద్గురుంశ్రీకృష్ణం వందే జగద్గురుం

మహాభారతంలోని ప్రముఖులైన ఇద్దరు మహోన్నతులు – కృష్ణుడు, కర్ణుడు మధ్యన ఒకసారి మంచి చర్చ జరిగింది… కర్ణుడు కృష్ణుడుని అడిగాడు… నేను పుట్టీపుట్టగానే నన్ను నా తల్లి వదిలేసింది.. అశాస్త్రీయమైన జన్మను పొందడం అనేది నా తప్పా..కాదే.. ద్రోణాచార్యులు నాకు విద్య

మన విలువ, మన నోరు చెపుతుందిమన విలువ, మన నోరు చెపుతుంది

ఒక పర్యాయం విక్రమాదిత్య మహారాజు తన సైనికులతోను, మంత్రితోను కలిసి వేటకై అడవికి వెళ్ళాడు. వేటాడుతూ వేటాడుతూ అడవిలో ఒకరికొకరు దూరమైనారు. ఒకచోట చెట్టు క్రింద నీడలో అంధుడు, వృద్ధుడు అయిన ఒక సాధువు కూర్చొని ఉండగా చూచి విక్రమాదిత్యుడు ‘సాధు