తప్పును తప్పు అని అన్నా అందాం

Reading Time: < 1 minute

చల్లటి నీళ్ళ లో ఉండాల్సిన ఓ కప్ప ఆ నీళ్ళ లో ఉన్నంత కాలం బాగానే ఉంటుంది.

ఆ కప్ప కుండలో ఉందనుకోండి. మామూలుగానే ఉంటుంది. కొద్దిగా వేడిచేయడం మొదలుకాగానే మొదట్లో అడ్జస్ట్ అవుతుంది. వేడి ఇంకా పెరగ్గానే తర్వాత అడ్జస్ట్ అవ్వలేక చనిపోతుంది.

చిన్న కథ అయినా అర్థం ఉన్న కథ. అలాగే ఓ రెండు సంవత్సరాల క్రితం ఒకరు ఓ కామెంట్ వ్రాశారు. ఇప్పుడున్న పరిస్థితులను మనిషి భరించగలడు కాబట్టి భరిస్తున్నాడు. భరించలేనప్పుడు చనిపోవడమే .
వేరే మార్గం లేదు.

ఇప్పుడు ఓ సమస్య వచ్చిందనుకోండి పోలీసుల వద్దకు వెళ్ళే పరిస్థితులు లేవు. వారి చేతిలో లేని తిట్టడం ,కొట్టడం లాంటివి చేస్తారు.

కోర్టుకు వెళతామనుకోండి. ప్రతీచోటా పీల్చుడేనట. నంబర్ రావాలన్నా,పోష్టులో లెటర్ పంపించాలన్నా,అమీనా వెళ్లి పిలుచుకురావాలన్నా లంచాలే.

ఇవన్నీ ప్రజలు భరిస్తున్నారు. ఇక శ్రీ శ్రీ శ్రీ జడ్జివారు అమ్ముడుపోరని ఎక్కడా లేదు.

ఇక మన లాయరుకి అడిగినంత ఇచ్చుకోవాలి. ఈయన కూడా మన ఎదుటి లాయరుకు సహకరించడని ఎక్కడా వ్రాసిపెట్టి లేదు

కనుక తప్పును తప్పు అని 0.001% అన్నా అందాం. లేకుంటే అనడానికి రేపు మనం ఉండం.

Leave a Reply