ఆడపిల్ల తండ్రికి వందనం

Reading Time: < 1 minute

ఒకరోజు ఒకతండ్రి తన కూతురుతొ ఒక చిన్న వాగును దాటుతున్నాడు. ఆసమయంలో తండ్రికి చిన్న సందేహం కలిగింది. ఆ వాగు ప్రవాహంలో తన కూతురు ఏమవుతుందో అని ఆ పాపతో ఇలా అన్నాడు…

“చిన్న తల్లీ… నా చేయి గట్టిగా పట్టుకొని నడువు. అప్పుడు నువ్వు వాగులో పడిపోకుండా ఉంటావు”…

అప్పుడు ఆ పాప ఇలా అంది.
“లేదు నాన్న… మీరే నాచేయి పట్టుకోండి.” అపుడు ఆతండ్రి ఆశ్చర్యంగా ఆపాపని “నేను చెప్పింది కూడా అదే కదమ్మా! రెండింటికి తేడా ఏమిటి” అని అడిగాడు. అప్పుడు ఆపాప ఇలా చెప్పింది…

“చాలా తేడా ఉంది నాన్న”… నేను మీ చేయి పట్టుకొని నడిస్తే ఏ కారణంగా అయినా నేను మీ చేయి వదలవచ్చు. కానీ మీరే నా చేయి పట్టుకొని నడిస్తే ఎంత పెద్ద కారణంగా అయినా సరే, ఏ పరిస్థితిలోనైనా, ఏమి జరిగినా సరే మీరు మాత్రం నా చేయి వదలరు అని నమ్మకంగా తండ్రితో చెప్పింది…

వెంటనే ఆతండ్రి పాపని హత్తుకొని “నువ్వు నా బంగారు తల్లివిరా… నేను ఏమైనా సరే నీకు ఏ కష్టం రాకుండా చూసుకుంటాను” అని అన్నాడు…

అప్పుడు ఆ పాప “ఆ విషయం నాకు తెలుసు… అమ్మ 9 నెలలు కడుపులో మోస్తే… నువ్వు మాత్రం నన్ను నీగుండెలో పెట్టుకొని మోస్తావు. ఎందుకంటే నువు “నాన్నవి నాన్న” అన్నది.

ఆడ పిల్లని కన్న ప్రతి తండ్రికి అంకితం

Leave a Reply