బుద్ధి చెప్పిన దెయ్యం

Reading Time: 3 minutes

బుద్ధి చెప్పిన దెయ్యం

అది ఒక రాత్రి పదకొండు గంటల సమయంలో రోడ్డు మీద రాజు , లయ నడుచుకుంటూ వెళ్తారు . ఇంతలో లయ మధ్యలో ఆగిపోతుంది .రాజు మాట్లాడుకుంటూ అలాగే వెళ్ళిపోతాడు . ఒక్కసారిగా తిరిగి చూస్తాడు . రాజు లయ దగ్గరికి వచ్చి



రాజు :- లయ ఏంటి ఇక్కడే ఆగిపోయావ్ ?? పదా వెల్దాము.

లయ :- చూడు నీకు అక్కడ ఏమి కనిపించడం లేదా ??

రాజు :- నీకు ఏమైనా పిచ్చా ?? నాకు ఏమి కనిపించడం లేదు . నువ్వు ఎక్కువ ఉహించుకుంటున్నావ్ ఇక్కడ ఏమి లేదు !!

లయ :- నాది ఊహ కాదు , జరగబోయేది నాకు తెలుస్తుంది రాజు .మనము ముందుకు వెళ్లకూడదు . వెనక్కి తిరిగి వెళ్లిపోదాము రాజు అంటూ లయ ఏడుస్తూ ఉంటుంది .

లయ అన్న మాటలకు , రాజుకి బాగా కోపం వస్తుంది . రాజు , లయ మాటలను పట్టించుకోకుండా ఒక అడుగు ముందుకు వేస్తాడు . వెంటనే రాజు ముందు దెయ్యం రూపంలో ఉన్న ఇంకో లయ ప్రత్యక్షమౌతుంది . అప్పుడు రాజు వెనక్కి తిరిగి చూస్తాడు . వెనుక లయ ఉంటుంది . ముందు కూడా లయ ఉంటుంది .


లయ దెయ్యం :- ఏ రాజు నీకెందుకంత కోపం . శాంతంగా ఉండటం తెలీదా నీకు ???

రాజు :- అస్సలు నువ్వు ఎవరు నాకు చెప్పడానికి ?? నా కోపం నా ఇష్టం ??

లయ దెయ్యం :- నీ కోపం వల్ల బలి ఐన వాళ్లలో నేను కూడా ఒక దాన్ని . ఇప్పుడు నీ పక్కన ఉన్న లయ ప్రాణం నా చేతుల్లో ఉంది .

రాజు :- హ ..ఉంటే ఏమి చేస్తావ్ ?? నువ్వు ??

లయ :- రాజు నీకేమైంది ?? ఎందుకిలా చేస్తున్నావు ??

రాజు :- నీకేమి తెలియదు …నువు ఏమి మాట్లాడకు ??

లయ దెయ్యం :- ఇలా మాట్లాడనియ్యకుండా ఎంత మంది నోరు ముపిస్తావ్ ??

రాజు :- నువ్వు దెయ్యం రూపంలో వచ్చిన నన్ను ఏమి చెయ్యలేవు ??

లయ దెయ్యం :- రాజు మంచివాడుగా ఉన్నట్టు నటిస్తాడు అంతే… కాని మంచి వాడు మాత్రం కాదు లయ . నువ్వు కూడా నా లాగా మోసపోకు ??

లయ :- ఏంటి ?? ఏమి మాట్లాడుతున్నావ్ ?? నా రాజు చాలా మంచి వాడు !! నన్ను మోసం చెయ్యాడు ??

లయ దెయ్యం :- నాకు కూడా అలానే చెప్పి చివరికి నన్ను చంపి , ఇప్పుడు నీ దగ్గరకి వచ్చాడు . అతనికి కావాలిసింది మన మనస్సు కాదు. మన కళ్ళు మాత్రమే .

రాజు :- హే… ఏమి మాట్లాడుతున్నావ్ … లయ నువ్వు అస్సలు నమ్మకు . నేను నిన్ను నిజంగా ప్రేమిస్తున్నాను . ఇది కావాలనే ఇలాగ చెప్తుంది .

లయ దెయ్యం :- ఇంకా నువ్వు మోసం చెయ్యాలని చూడకు రాజు . ఇంకా కొంచం సేపటిలో నిజాలన్ని బయటికి వస్తాయి .

రాజు :- హే ఏమి నిజాలు ..నేను ఎవరిని ఏమి చెయ్యలేదు ?? నేను ఎందుకు భయపడాలి .

లయ :- రాజు ఇంక ఆపు నీ నాటకాలు . నీ గురించి నాకు ముందే తెలుసు . కావాలనే నిన్ను ఇక్కడికి తీసుకొచ్చాను . నాకు ఈ దెయ్యం నీ గురించి ముందే చెప్పింది . నువ్వు మరతావని చూసాను . నువ్వు మారలేదు.

రాజు :- లయ నేను ఏ తప్పు చెయ్యలేదు . నన్ను నమ్ము . మన ప్రేమ మీద ఒట్టు .

లయ దెయ్యం :- రాజు నువ్వు ఇంత పిచ్చివాడవా ??? బుట్టలో పడిపోయాక కూడా పైకి రావాలనుకొంటున్నావ్. ఇంకా ప్రేమ, దోమ అంటున్నావు. లయ నేను చేయాల్సిన సహాయం చేసాను ఇంకా నువ్వే చూసుకో అంటూ… అక్కడ నుంచి లయ దెయ్యం మాయమౌతుంది.

లయ :- హే నేను నిన్ను ప్రేమించలేదు . ప్రేమించినట్టు నటించాను



అని చెప్పి లయ నడుచుకుంటూ వెళ్ళిపోతుంది.
రాజు లయ.. లయ …అని పిలిచిన పట్టించుకోదు.
ఎట్టకేలకు రాజు లయ దగ్గరకు
పరుగెత్తుకుంటు వెళ్తాడు . లయ ఒక్క నిముషం ఆగుతుంది.



రాజు :- ఆగు … లయ నేను నీకు అంతా చెప్తాను. లయ నేను పెద్ద తప్పు చేసాను నన్ను క్షమించు . నేను చాలా పాపాలు చేసాను . నా తప్పు నేను తెలుసుకున్నా.. నన్ను విడిచి పెట్టి వెళ్లకు .



లయ :- క్షమించు రాజు …నేను నిన్ను ఇంకా నమ్మలేను. దయచేసి నన్ను వదిలేయ్. నీకు చేయాలిసిన న్యాయం నీకె చేస్తాను అప్పటి వరకు ఇక్కడే ఉండు అని చెప్పి లయ వెళ్ళిపోతుంది.



రాజుకు ఏమి చెయ్యాలో తెలియక …. అక్కడే నిలబడిపోతాడు. లయ… రాజు మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చి వస్తుంది . పోలిసులు రాజు దగ్గరకు వచ్చి స్టేషన్కు తీసుకెళ్తారు.

Leave a Reply