యువత

Reading Time: 2 minutes

యువత ఒక్కసారి అనుకుంటే సాధించలేనిది అంటూ ఏమి ఉండదు . ఒక దేశాన్ని మార్చలన్నా , పోరాటాలు చేయాలన్నా అది యువత వల్లే సాధ్యం అవుతుంది. అలాంటి యువత ఇప్పుడు పక్కదోవ పట్టి వాళ్ళ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు.


చదువుకున్న వాళ్ళకి విడమర్చి చెప్పాలిసిన అవసరం ఉండదు. ఎందుకంటే వాళ్ళు విద్యావంతులు కాబట్టి. చదువు లేని వాళ్ళకి విడమర్చి , అర్థం అయ్యేలా చెప్పాలి. ఎందుకంటే వాళ్ళు విద్యా వంతులు కారు కాబట్టి. ఇప్పుడు ఉన్న సమాజంలో చదువు లేని వాళ్లే సంస్కారంగా ఉంటున్నారు. చదువుకున్న వాళ్ళు సంస్కారం కూడా తెలియటలేదు. పిల్లలు ఏ తప్పు చేసినా ముందు పిల్లలను అనరు. వాళ్ళని కన్న తల్లిదండ్రులను అంటారు . పెంపకం సరిగా ఉంటే పిల్లలు ఇలా ఎందుకు ఉంటారు అని ?


ఇక్కడ తప్పు యువతదే ?? ఎందుకంటే తల్లిదండ్రులు పిల్లలను జాగ్రత్తనే పెంచుతారు.యువతలో కొంత మంది ఉంటారు. వాళ్ళు చెడిపోయేది కాక పక్కని వాళ్ళని కూడా చెడగొడతారు. చెడగొట్టేదే వాళ్లే. చెడి పోవాలనుకుంటే మీరు ఒక్కరే చెడిపోండి. పక్కని వాళ్ళని చెడగొట్టకండి. పక్కన వాళ్ళని చెడగొట్టే హక్కు మీకు లేదు.


• ఓ యువత మేలుకో …!!!
” రోజు ” ఏమో నేను రోజూ వస్తున్నా వెళ్లిపోతున్నా ?
అని అంటుంది ,
” సమయం ” ఏమో మీరు బ్రతికి ఉన్నతవరకు మీతోనే
ఉంటాను అని అంటుంది !!
మరి యువత ఏమో రోజును, సమయాన్ని చూస్తూ
వృధా చేస్తున్నారు !!!!



యువత మంచి పనులు చేస్తే సమాజంలో కూడా మార్పులు వస్తాయి. వాళ్ళని చూసి పెద్ద వాళ్ళు కూడా మారతారు. మనము చేసే మంచి పని మనకి మంచి అనిపిస్తే చాలు. అది వేరే వాళ్ళకి నచ్చాలిసిన అవసరం లేదు. అలాగే మనము మంచి చేయాలంటే పది మందికి చెప్పి చేయాలిసినంత అవసరం లేదు ? మనం చేసిన మంచి పనిని పది మంది గుర్తిస్తే చాలు !!కొంతమంది యువత భయ పడుతూ ఉంటారు. భయాన్ని పోగొట్టుకోవాలి. ఎంత కాలం అని భయ పడుతూ ఉంటాము.భయాన్ని తరిమికొట్టండి.


భయాన్ని పోగొట్టుకోవాలంటే ఒక్కటే
మార్గం !!! ధైర్యంతో సాహసం చేయండి !!
భయాన్ని తరిమికొట్టండి !!!కాలం చాలా విలువైనది . ఒక్కసారి పోతే ఎన్ని మళ్ళీ వెనక్కి తిరిగి తీసుకురాలేము. ఆలోచించి అడుగు వేయండి !!ఒక ఆలోచన మనిషికి మారుస్తుంది అంటారు !! మరి మనిషి ఎందుకు ఆలోచన దగ్గరే ఆగిపోతున్నాడు ?? ఎదుటివాళ్ళ గురించి ఆలోచించడం ఎప్పుడు మానేస్తారో ??
అప్పుడు మీ ” ఆలోచన ” బయటికి వస్తుంది !!!
” మంచిని” గెలిపించనంత కాలం
” చెడు ” పడుతూనే ఉంటుంది .
మంచి చేయకపోయినా పర్వాలేదు
కానీ చెడు వైపు మాత్రం నిలబడకండి ??

Leave a Reply