రొయ్యల వేపుడు

Reading Time: < 1 minute

రొయ్యల వేపుడు

రొయ్యలు అంటే చాలా మందికి ఇష్టం. కానీ ఇవి దొరకాలంటే కొంచం కష్టం. వీటిని ఎలా వండుతారో కూడా కొంతమందికి తెలియదు. రొయ్యలతో కొంత వంటకం ఎలా చెయ్యాలో నేను మీకు చెబుతాను. కొత్త వంటకం ఏమిటా అని ఆలోచిస్తున్నారా ? అంత ఆలోచించకండి అది ఏంటి అంటే రొయ్యల వేపుడు . రొయ్యల వేపుడకు కావలిసిన వస్తువులు మరియు తయారీ విధానం కూడా గురించి తెలుసుకుందాము.


కావలిసిన వస్తువులు :-

రొయ్యలు – 5 ,
నిమ్మరసం – 150 మిల్లీ లీటర్లు ,
అల్లం వెల్లుల్లి పేస్ట్ – 15 గ్రాములు ,
నెయ్యి – 25 మిల్లీ లీటర్లు ,
కారం – 20 గ్రాములు ,
మిరియాల పొడి – 3 గ్రాములు .
కొత్తిమీర – కట్ట
ఉప్పు – సరిపడినంత ,
పసుపు – 1 టీ స్పూన్ .


తయారు చేసే విధానం :-

ముందుగా రొయ్యలను తీసుకొని బాగా శుభ్రపరచుకోవాలి. శుభ్రపరచిన రొయ్యలకు ఉప్పు, అల్లంవెల్లుల్లి పేస్ట్ బాగా పట్టించి తరువాత
ఆ మిశ్రమాన్ని నిమ్మరసంలో 20 నిముషాల పాటు నానబెట్టుకోవాలి. ఆ తరువాత వాటిని బయటికి తీసి కారం, మిరియాల పొడి, పట్టించి పక్కన పెట్టుకోవాలి. ఆ తరువాత కళాయిలో నెయ్యి వేసి మంట చిన్నగా పెట్టుకొని రొయ్యలని వేయించాలి.
రొయ్యలని ఒక ప్లేట్ లో తీసుకొని, కొత్తిమీర పై పైన చల్లుకోవాలి. అంతే రొయ్యలు వేపుడు రెడీ .రొయ్యల వేపుడును వేడి వేడిగా తింటే చాలా రుచిగా ఉంటాయి.

Leave a Reply