పానీ పూరి

Pani Puri
Reading Time: 2 minutes

పానీ పూరి తినని వాళ్ళు అంటూ ఎవరు ఉండరు. ఇది అంటే తెలియని వాళ్ళు కూడా ఎవరు ఉండరు .ఎందుకంటే ఇది అందరికి ఇష్టమైన ఫుడ్ కాబట్టి. ఇప్పుడు లాక్ డౌన్ వల్ల చాలా మంది దీన్ని మిస్ అవుతున్నారు. అలాంటి వారు మీ ఇంట్లోనే మీరు తయారు చేసుకోవచ్చు. ఎలానో నేను మీకు చెప్తాను . కానీ ఇప్పటివరకు మనకి దీన్ని తినడమే తెలుసు. పానీ పూరి చేయడం మనలో చాలా మందికి తెలియదు కదా. ఇప్పుడు తెలుసుకుందాము.దీనికి కావలిసిన పదార్థాలు , ఎలా తయారు చేయాలో, ఏవేమి వాడుతారో వాటి గురించి తెలుసుకుందాము.



కావలిసిన పదార్థాలు :-

ఉప్మా రవ్వ – అర కప్పు( బొంబాయి రవ్వ ) తీసుకుంటే సరిపోతుంది,
మైదా పిండి – 1 టేబుల్ స్పూన్ , పుదీనా – 2 కట్టలు, ధనియాల పొడి – 1 టీ స్పూన్ , చింత పండు – కొంచెమె తీసుకోండి ,ఎక్కువుగా తీసుకోకూడదు. బ్లాక్ సాల్ట్ – 1 టీ స్పూన్,
అల్లం – 20 గ్రాములు , పచ్చిమిర్చి – 3 , జీలకర్ర – 1 టి స్పూన్, మొలకలు – అర కప్పు, నూనె – సరిపడినంత , ఉప్పు – తగినంత తీసుకోవాలి.



తయారీ విధానం :-

బొంబాయి రవ్వని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఆ తరువాత వాటిలోకి మైదా మరియు ఉప్పు తీసుకొని , ఈ మిశ్రమంలో కొంచం నీళ్లు తీసుకొని పూరి పిండిలా కలుపుకొని 20 నిముషాలు పాటు నాన పెట్టుకోవాలి. ఆ తరువాత ఈ పిండిని తీసుకొని చిన్న చిన్న ఉండలుగా చేసుకొని పురిల్లా వత్తి నూనెలో వేయించుకోవాలి. మీరు నూనెలో వేయగానే పూరీలు పొంగుతాయి. అక్కడితో పూరీలు పని ఐనట్లే. చేసినా పూరీలకు గాలి తగలకుండా చూసుకోవాలి. లేకపోతే మెత్తగా ఐపోతాయి.

ఇప్పుడు చింత పండును ఒక గిన్నె లోకి తీసుకొని నీళ్ళు పోసి గంట పాటు బాగా నానబెట్టుకోవాలి.
పుదీనా, పచ్చిమిర్చి, అల్లం వేసి వీటిని నూరుకోవాలి. చింత పండును తీసి వేయాలి. అది తీసిన తరువాత ఆ మిశ్రమం లో ఇంకా కొన్ని నీళ్ళను కలుపుకోవాలి. అందులో ధనియాల పొడి, జీలకర్ర పొడి, పచ్చిమిర్చి అల్లం పేస్ట్ , ఉప్పు , బ్లాక్ సాల్ట్ వేసి బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తరువాత ఆ మిశ్రమాన్ని కదపకుండా మూడు గంటల పాటు ఉంచాలి. ఇంకా పానీ పూరి రెడి. ఇప్పటికి చాలా మిస్ అయ్యారు ఇంకా ఆలస్యం చేయకండి. మీరు కూడా మీ ఇంట్లో తయారు చేసుకోండి.

Leave a Reply