Site icon Chandamama

ధర్మసూక్ష్మమ్ – కాయా పేక్ష, ఫలా పేక్ష

Hinduism @pexels.com
Reading Time: < 1 minute

ధర్మసూక్ష్మమ్ – కాయా పేక్ష, ఫలా పేక్ష

కాశీ వెళ్ళినప్పుడు మనకిష్టమైన కాయనో,  పండునో విడిచి పెట్టి రావాలంటారు.

ఆమేరకు మనం మనకిష్టమైన ఏదో ఫలాన్ని, ఏదో ఒక కాయను వదిలేసి వస్తుంటాం.

ఆ తర్వాత నుండి వాటిని తినడం మానేస్తాం.

పైగా “నేను జామపండు తిననండీ” కాశీలో ఎప్పుడో వదిలేశాను “
“నేను కాకరకాయ తిననండీ, కాశీలో వదిలేశాను అని చెప్పుకుంటాం.

నిజానికి పెద్దలు వదలమన్నది,

 “కాయా పేక్ష, ఫలా పేక్ష “

వదులు కోవడం అంటే తినే కాయలు ఫలాలు వదిలేయటం కాదు.

కాయాపేక్ష అంటే :- దేహం పట్ల ప్రేమ.  ప్రతి వ్యక్తికి ఉంటుంది. శరీరం పట్ల ఆపేక్ష ఉంటుంది. అది వదిలేయమని, నా శరీరానికి సుఖం కావాలి, ఏసీ కావాలి, మెత్తని పరుపు కావాలి, తినడానికి రుచికరమైన భోజనం కావాలి, ఇలాంటి వన్నీ వదిలేసి సాధువులా బతకమని అర్ధం.

ఫలాపేక్ష అంటే :-  ఏదైనా పని చేసి దాని ధ్వారా లభించే ఫలితం పట్ల ఆపేక్ష వదిలేయమని.

ఉదాహరణ:- పది రూపాయలు దానం చేసి, దాని ద్వారా ఫలితం ఆశించటం.  యజ్ఞం చేసి ఏదో కోరుకోవడం.  బంధుమిత్రులకు సహాయం చేసి దాని ద్వారా ఏదో కావాలని కోరుకోవడం మానుకొమ్మని అర్ధం

Exit mobile version