Site icon Chandamama

ఎగిరే పుస్తకం

Flying Book
Reading Time: 2 minutes

ఎగిరే పుస్తకం


అనగనగా ఒక రాజ్యం. ఆ రాజ్యంలో పుస్తకాలకు కొదువ లేదు,పుస్తకాలు చదవని వారు అంటూ ఎవరు లేరు. అలాగే పుస్తకాలను జాగ్రత్తగా చూసుకునే వాళ్ళు లేరు. ఆ రోజు వినాయక చవితి పూజా మందిరంలో ఉన్న ఓ పుస్తకం పిల్లలు కోరికలను దేవుడి ముందు చేప్తుండగ పుస్తకం విన్నది. వెంటనే మనసులో‌ ఇలాగా అనుకుంది.


“ఆ దేవుడు అందరికి వరాలు‌ ఇచ్చినట్లే నాకు కూడా వరాలు ఇస్తే బాగుండు అని అనుకుంటాది
” వెంటనే దేవుడు ప్రత్యక్షమై ఇలాగా అన్నాడు..
” ఓ పుస్తకమా.. కల్మషం లేని మనసుతో నా దర్శనం కోరుకున్నావు. ఏ వరం కావాలో కోరుకో… అని దేవుడు చెప్తాడు. ” వెంటనే మనసులో‌ ఉన్న ఆవేదనని పుస్తకం దేవుడికి వివరిస్తుంది.

“ఓ దేవుడా నువ్వు ఇంత త్వరగా నా ఆవేదనని తెలుసుకొని నాకు వరాలు ఇవ్వడానికి ప్రత్యక్షమవుతావని అస్సలు అనుకోలేదు”. ఎంతోమందికి ఎన్నో విధాలుగా ఉపయోగపడిన నన్ను మాత్రం ఎవరు పట్టించుకోవడం లేదు. అవసరానికి మాత్రమే నన్ను ఉపయోగిస్తున్నారు.

భావితరాలకు ఎంతో ఉపయోగపడే నన్ను ఈ తరానికే అంకితం చేస్తున్నారు.
ఎండకు ఎండుతున్న…!
వానికి తడుస్తున్నా…!
గాలికి చెదురుతున్నా…!
మంటల్లో కాలిపోతున్నా…!
ఆ తర్వాత కూడా ఎన్నో విధాలుగా ఉపయోగపడుతున్నా…!
నన్ను చదివిన వారికి మంచి భవిష్యత్తును ఇస్తున్నా…!

అయినా నన్ను ఎవరు జాగ్రత్తగా చూసుకోవడం లేదు…!”. ఇన్ని చేస్తున్నా కానీ నాకు ఇవ్వాలిసిన గౌరవం ఇవ్వటలేదు. ( అని ఏడుస్తూ… ఉంటుంది.)అప్పుడు దేవుడు ” నీకు ఏ కష్టాలు రాకుండా ఓ వరం ఇస్తున్నాను…!” అన్నాడు. అప్పుడు ఆ పుస్తకం ఆనందంగా ఏమిటా… వరం అని అడుగుతుంది. ఇప్పటి వరకు ఎవరికి ఇవ్వని వరాన్ని నీకు ఇస్తాను.

కానీ ఈ సృష్టిలో నీ అవసరం ఎదో ఒక విధంగా ప్రతి యొక్కరికి ఉంటుంది. ” నిన్ను నువ్వే కాపాడుకునే విధంగా ఎగిరి పోయే వరం ఇస్తున్నాను తీసుకో..! ఈ ప్రపంచంలోనే ఎగిరే పుస్తకంగా చిరకాలం వర్ధిల్లుతావు”. అని ఆశీర్వదించి అద్రుశ్యమయ్యాడు. ఆ తర్వాత పుస్తకం దేవుడికి ధన్యవాదాలు తెలిపింది. హాయిగా ఎగురుతూ, ఆనందంగా కాలం గడుపుతూ, అందరికీ ఉపయోగపడుతూ, తనని తానే రక్షించుకుంటుంది. భావితరాలకు తాను ఉపయోగపడాలనే కోరికను నెరవేర్చుకున్నది…!

Exit mobile version