Site icon Chandamama

రెండు చేపలు కథ

Reading Time: < 1 minute



ఒక ఊరిలో ఒక చెరువు ఉండేది .ఆ చెరువు ఉరికి దగ్గరగా ఉండేది. చిన్న పిల్లలు అందరూ అక్కడే ఆడుకొనేవాళ్ళు. ఆ చెరువులో చేపలు కూడా ఉండేవి. ఒక రోజు చిన్న పిల్లలు చేపలను చూస్తారు. చిన్న పిల్లలకి చేపలను చూడగానే పట్టుకోవాలనిపిస్తుంది కదా .అలాగే పట్టుకోవాలని అనుకుంటారు. అలా చూసుకుంటూ చెరువులోకి దిగుతారు. ఎంత ప్రయతించిన చేపలు దొరకవు. ఆ చెరువులో రెండు ఎవరితో కలిసేవి కావు. ఆ రెండు చేపలు చాలా మంచి స్నేహితులు. చేపలు దొరకాలేదని పిల్లలు వెళ్ళిపోతారు.


మరుసటి రోజు రెండు చేపలు ఈ విధంగా మాట్లాడుకుంటాయి. మనల్ని ఎవరో ఒకరు తీసుకెళ్తారు. మన ఇద్దరు విడిపోతాము ఎమో అని అనుకుంటారు. అప్పుడు ఇంకో చేప నువు బాధ పడకు. మనల్ని పట్టుకొనేటప్పుడు మనలో ఒకరు దొరికితే ఇంకొకరు వాళ్ళ కన్నా ముందే ఒడ్డుకు చేరుకోవాలి. ఈ విధంగా చేస్తే ఇంకో చేప ఒడ్డుకు వచ్చింది అని పట్టుకున్న చేపను వదిలేస్తారు.అప్పుడు ఇద్దరికి ఏమి కాదు. అలా వాళ్ళతో కొంచం సేపుఆడుకుందాము.మనుషులకు ఆశ కంటే అత్యాశ అంటేనే ఎక్కువ మక్కువ.

ఆ తరువాత పిల్లలు చేపలు పట్టుకోవడానికి చెరువు దగ్గరికి వస్తారు. ఇంతోలో ఒకరికి చేప దొరుకుతుంది . రెండో చేప ఒడ్డుకు చేరుకుంటుంది. రెండో చేప పెద్దదిగా కనిపించడం వల్ల వాళ్ళు చూసుకోకుండా మొదటి చేపను వదిలేస్తారు. రెండో చేప వాళ్ళతో బాగా పరుగులు పెట్టిస్తాది. ఐన వాళ్ళకి దొరకదు. ఇంకా పిల్లలకి ఒక్క చేప కూడా దొరకదు. పిల్లలు అలిసిపోయి వెళ్ళిపోతారు. ఆ తరువాత రెండు చేపలు కలుసుకుంటాయి.

దొరికిన వాటితో తృప్తి చెందాలి. అత్యాశకి పోయి ఉన్నది కూడా పోగొట్టుకోకూడదు !!!

Exit mobile version