Site icon Chandamama

నలుగురు మిత్రులు

Lion Photo by Jimmy Chan from Pexels: https://www.pexels.com/photo/grayscale-photo-of-lion-statue-975437/
Reading Time: < 1 minute

నలుగురు మిత్రులు

ఒక ఊరిలో నలుగురు స్నేహితులు ఉన్నారు. వారు విజ్ఞానంతో పాటు తమ పోషణ కోసం ఇతర కళలను నేర్చుకోవడానికి బయలుదేరారు. వారు ఒక గొప్ప యోగికి సేవలు చేసి ఆయిన అనుగ్రహంతో కొన్ని మానసిక శక్తులను, విధ్యలను నేర్చుకున్నారు. 

నలుగురిలో ఒకడికి విరిగిన యముకలను జత చేసే శక్తి అబ్బింది. రెండోవాడు తగిలిన గయాలను మాన్పించే శక్తిని నేర్చుకున్నాడు. మూడోవాడు రక్తనాళాలలో రక్తాన్ని ప్రసరింపజేయగల నేర్పును పొందాడు. నాలుగవ వాడు ప్రాణం పోసే  విధ్యను సాధించాడు. ఈ నలుగురు నాలుగు దివ్య శక్తులను పొందగలిగారు. ఆ తరువాత గురువు గారి వాద్ధ సెలవు తీసుకొని వారు ఇంటి ముఖం పట్టారు.

వూరు చేరడానికి అడవి గుండా పోవాల్సివచ్చింది. క్రూర మృగాలకు ఆలవాలమయిన ఆ అడవిలో నలుగురు కలిసి ఒక చచ్చిన సింహాన్ని చూశారు. తమ శక్తులను ఉపయోగించి, ఈ సింహాన్ని బ్రతికించాలనే కోరిక వారిలో కలిగింది. ‘ఇది క్రూర జంతువు దీన్ని బ్రతికించితే అది మనలను చంపుతుంది’ అని ఒకడు చెప్పాడు. అందుకు ఇంకొకడు ‘మనము దీన్ని బ్రతికించాము, కాబట్టి మనలను ఏమి చేయదు’ అని పని ప్రారంభించారు. ఈ సింహాన్ని బ్రతికించితే అది మనలను చంపుతుంది అన్నవాడు చచ్చిన సింహం ఎముకలను జోడించి, ప్రక్కనే ఉన్న చెట్టు ఎక్కి కూర్చున్నాడు. రెండవ వాడు గాయాలను మానేలా చేశాడు. మూడోవాడు అబ్బిన విద్య రక్త ప్రసరణ కలుగజేశాడు. ఇప్పుడు నాలుగోవాడి వంతు వచింది. వాడు తన విద్యను ఉపయోగించి ఆ సింహానికి ప్రాణం పోసాడు. 

ఫలితంగా మళ్ళీ ప్రాణం వచ్చిన సింహం ఆ ముగ్గురిపై విరుచుకుపడి వారిని ఆహారంగా భుజించింది. చెట్టు పైకి ఎక్కినవాడు జరిగిన సంఘటన చూస్తూ ఉండి పోయాడు.

Exit mobile version