Site icon Chandamama

తక్కువ సమయంలో జుట్టు బాగా పెరగాలంటే ఈ విధంగా చేయండి !!!

long hair Girl @pixels
Reading Time: < 1 minute

జుట్టు శరీరంలో ఎంతో అందమైనది.. అయితే అలాంటి జుట్టును ఎంత జాగ్రత్తగా చూసుకున్న ఈ వర్షాల కారణంగా, దుమ్ముదూళి కారణంగా జుట్టు రాలుతూనే ఉంటుంది.ఒకరు అని కాకుండా చాలా మంది జుట్టు రాలిపోతూ ఉంటుంది. వాళ్ళు ఇంకా భయపడి హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతా ఉంటారు .ఐన కానీ ఏమీ ప్రయోజనం ఉండదు.జుట్టు సమస్య ముఖ్యంగా అమ్మాయిలకు బాగా ఉడిపోతుంది. మీరు ఎక్కడికి వెళ్ళకుండా మీ ఇంట్లో ఉండే వాటిని వాడి మీ జుట్టును ఉడిపోకుండా చేసుకోండి . ఈ జుట్టు రాలటం ఆగాలంటే ఈ విధంగా చేయండి. జుట్టు ఒత్తుగా పెరగాలి అంటే ఈ నూనెల చిట్కాలు ఉపయోగించి మీ జుట్టుని కాపాడుకోండి. అయితే ఏ నూనె ఉపయోగిస్తే జుట్టు అందంగా ఉంటుంది కింద చెప్తాను. ఆ నూనెలను వాడండి.



1) జుట్టుకు ఆముదం నూనెను కూడా ఉపయోగించ వచ్చు. ఆముదం నూనెతో మర్దన చేయటం వల్ల జుట్టు రాలటం అగుతుంది. అంతే కాకుండా నల్లని, ఒత్తైన జుట్టు కూడా పెరుగుతుంది.


2) కుదుళ్ళ నుంచి చివరి వరుకు జుట్టు దృఢంగా ఉండాలంటే ఉసిరినూనె వాడటం చాలా మంచిది. రాత్రి నిద్రకుముందు ఉసిరి నూనెను తలకు పట్టించుకుని మర్దన చేసుకుంటే కొంచెం అలసట తొలగిపోతుంది. చుండ్రు కూడా తగ్గుతుంది. జుట్టురాలడం, తలనొప్పి కూడా తగ్గిపోతాయి.కొన్ని రోజులకి జుట్టు పెరుగుతుంది.

Exit mobile version