Site icon Chandamama

అమ్మవారి కుంకుమ పూజ ఎవరు చేయాలి

Reading Time: < 1 minute

అమ్మవారి కుంకుమ పూజ ఎవరు చేయాలి…………!!

అమ్మవారి కుంకుమ పూజ ఎవ్వరైనా చేయచ్చు,
పిల్లలు చేస్తే అమితంగా ఆనందపడుతుంది
మగవారు చేస్తే వీడు నా బిడ్డ అని ఆశీర్వదిస్తుంది
స్ట్రీలు చేస్తే ! వారిలో..
అమ్మవారు తన రూపాన్ని చూసుకుంటుంది

అవును ఆడవారు కుంకుమ పూజ చేస్తూ
లలితా సహస్త్రనామం పారాయణం చేస్తున్న సమయంలో అమ్మవారు వారిలో తన రూపాన్ని చూసుకుంటుంది..

ఏమిటి నిదర్శనం అంటారా,
వశిన్యాది దేవతలకు లలితా రహస్య సహస్త్రనామం
చెప్పమని ఆజ్ఞాపించినప్పుడు అమ్మవారు వారితో ‘పలికేది మీరైన మీలో ఉండి పలికించేది నేనే” ని
చెప్పారు కదా..
అలాంటి లలితా పారాయణం చేస్తు కుంకుమ పూజ చేస్తున్న స్ట్రీ రూపంలో అమ్మవారు ఆనందంతో
వారిలో తన రూపాన్ని చూసుకుంటుంది…

అంత కన్నా ఏమీ వరం కావాలి
అమ్మవారి రూపంగా నీ రూపాన్ని అమ్మవారు భావించగానే నీ పాపములన్ని నశించి పోతాయి
నీ దేహం మనసు పవిత్రం అవుతుంది,
మళ్ళీ ఏదైనా పాప కర్మలు చేసి మురికిని
అంటించుకుంటున్నారు కానీ..
సదా సత్ ప్రవర్తనతో ఉంటే దేవీ ఉపాసన చేసే
ప్రతి స్త్రీ అమ్మవారి స్వరూపాలే…

Exit mobile version