Site icon Chandamama

నలభై ఏళ్ల వయసు to తొంభైఏళ్ల వయసు

Reading Time: < 1 minute

నలభై ఏళ్ల వయసులో..
ఉన్నత విద్యావంతులు.. సాధారణ విద్యావంతులు.. ఇద్దరూ సమానమే.
సంపాదనలో ఎదుగుదలను మాత్రమే సమాజం గమనిస్తుంది.

యాభై ఏళ్ల వయస్సులో..
అందమైన దేహం.. అందవిహీనం..
మద్య తేడా.. చాలా స్వల్పం. శరీరంమీద మచ్చలు ముడతలు దాచిపెట్టలేం.
ఇప్పటివరకు అందంతో వచ్చిన గౌరవాన్ని కాపాడుకోవటానికి తంటాలెన్నో పడాల్సివస్తుంది.

అరవై ఏళ్ల వయసులో..
ఉన్నత శ్రేణి జీవితం.. సాధారణ జీవనం.. రెండూ ఒకటే.
పదవీవిరమణ తర్వాత బంట్రోతు కూడా పలకరించకపోవచ్చు.

డెబ్బై ఏళ్లవయస్సులో..
విశాలమైన భవంతి.. సాధారణ నివాసం.. రెండూ సమానమే…
కీళ్లనొప్పులతో కదల్లేని స్థితి. సేదతీరటానికి ఓమూలన చిన్నస్థలం చాలు.

ఎనభైఏళ్ల వయస్సులో..
ధనంవున్నా లేకపోయినా ఫర్వాలేదు.
ఎంత డబ్బున్నా … స్వంతంగా ఎక్కడా ఏమీ ఖర్చు పెట్టలేం.

తొంభైఏళ్ల వయస్సులో..
నిద్ర మెలుకువ రెండూ ఒకటే.
సూర్యోదయం.. సూర్యాస్తమయం… రెంటినీ లెక్కించటం తప్ప ఏం చేయాలోకూడా తెలియదు.

అందంతో వచ్చే మిడిసిపాటు…
ఆస్తులతోవచ్చే అహంకారం…
పదవులతో గౌరవాన్ని ఆశించటం…
కాలగమనంలో మన కళ్లముందే కనుమరుగవడం సత్యం.

సుధీర్ఘ జీవన ప్రయాణంలో అందరూ సమానమే.

అందుకే.. ఒత్తిడిలకు దూరంగావుంటూ…
అనుబంధాలను పదిలపరుచుకుంటూ…
జీవనంలోని మాధుర్యాలను ఆస్వాదిద్దాం..!

Exit mobile version